తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల దగ్గర పెరిగే పిల్లలు కేవలం ప్రేమతో నిండిన వాతావరణంలో పెరగడమే కాదు.. మానవత్వం, జ్ఞానం, ఓర్పు, నైతికత వంటి విలువలను సైతం అలవర్చుకుంటారు. ఇది వారిని మరింత బాధ్యతాయుతంగా, సమాజాన్ని అర్థం చేసుకోగలిగే వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అందుకే పెద్దల దగ్గర పెరిగిన పిల్లలు ప్రత్యేకంగా ఉంటారు. నిజానికి తాతమ్మల చుట్టూ గడిపే బాల్యం వరం లాంటిది. ఈ అనుభవాన్ని పిల్లలకు ఇవ్వగలిగితే.. అది వారి జీవితంలో గొప్ప బహుమతిగా నిలిచిపోతుంది.