పిల్లల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలంటే..

Published : May 15, 2025, 04:48 PM IST

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చిన్ననాటి నుంచే సరైన పౌష్టికాహారం పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. మరి పిల్లల కిడ్నీల ఆరోగ్యాన్ని చిన్న వయసు నుంచే కాపాడేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన 6 ముఖ్యమైన చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
పిల్లల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పేరెంట్స్ ఏం చేయాలంటే..

1. హైడ్రేషన్ అలవాట్లు పెంపొందించండి

పిల్లలకు నీరే బెస్ట్ డ్రింక్. చక్కెర కలిగిన సోడాలు, ప్యాకేజ్డ్ జ్యూస్‌లు ఎక్కువగా ఇవ్వకండి. ఎందుకంటే ఇవి కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తాయి. అదేవిధంగా పిల్లలు మంచినీరు తాగాలన్నా మిమ్మల్ని అడిగే విధంగా కాకుండా వాళ్లకి వాళ్లు తాగేలా అందుబాటులో ఉంచండి. తల్లిదండ్రులు కూడా తరచూ నీరు తాగుతూ పిల్లలకు రోల్ మోడల్ గా నిలవాలి.

 

25

2. పోషణకు ఇంపార్టెన్స్ ఇవ్వండి

ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా ఉండే బ్యాలెన్స్‌డ్ ఆహారం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉప్పు ఎక్కువ తింటే రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీ ఫంక్షన్‌పై ప్రభావం చూపుతుంది. పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, ఇంట్లో వండిన భోజనాలను పిల్లలు తినేలా అలవాటు చేయండి. 

 

35

3. శారీరక చురుకుదనం

పిల్లలతో సింపుల్ వ్యాయామాలు చేయించండి. ఇవి ఆరోగ్యకరమైన బరువును మెయిన్‌టెయిన్ చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పిల్లలను బయట ఆడుకోనివ్వండి. డాన్స్, సైక్లింగ్ వంటి హ్యాబిట్స్ శారీరక చురుకుదనానికి ఉపయోగపడతాయి.

4. మందుల విషయంలో జాగ్రత్త 

డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం వల్ల కూడా కిడ్నీలు పాడైపోతాయి. ముఖ్యంగా పిల్లలకు నొప్పి నివారణ మందులు తరచుగా ఇవ్వకండి. ఇవి ఎక్కువగా ఉపయోగించినప్పుడు కిడ్నీలపై ప్రభావం పడుతుంది. 

45

5. హెచ్చరిక సంకేతాలను గమనించండి

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు(UTIs), కళ్ల చుట్టూ లేదా మోకాళ్ల వద్ద వాపు, మూత్రంలో రక్తం, పిల్లల్లో అసాధారణంగా అధిక రక్తపోటు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవి కిడ్నీ సమస్యల సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 

55

6. ఉదాహరణతో వివరించండి

పిల్లలు మనం చెప్పింది వినడం ద్వారా కంటే మనం చేసే పనుల నుండి ఎక్కువగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారాలు తింటే పిల్లలు కూడా అవే తింటారు. తల్లిదండ్రులు చురుకుగా ఉంటే వాళ్లు కూడా యాక్టివ్ గా ఉంటారు. నీరు తాగడం, వ్యాయామాలు చేయడం లాంటి పనులు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు కూడా వాటిని పాటిస్తారు. 

 

 

Read more Photos on
click me!

Recommended Stories