పిల్లలకు మార్కులు తక్కువ వస్తే ఏం చేయాలి? ఈ 6 చిట్కాలు తెలుసుకోండి
Telugu
శాంతంగా ఉండండి
మార్కుల షీట్ చూసి కోపం రావడం సహజం. కానీ వెంటనే స్పందించడం వల్ల పిల్లలు భయపడి మరింత వెనుకబడిపోతారు. మీరు శాంతించి తర్వాత మాట్లాడండి.
Telugu
పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడండి
"ఏమైంది నాన్నా? ఏ సబ్జెక్టులో ఇబ్బందిగా ఉంది?" అంటూ తిట్టకుండా, నిందించకుండా అడగండి. దీనివల్ల పిల్లలు తమ సమస్యలను చెప్పుకుంటారు.
Telugu
పోల్చడం మానుకోండి
ఇతరుల మార్కులతో పిల్లలను పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కరికి వారి సొంత టాలెంట్ ఉంటుందని గుర్తుంచుకోండి.
Telugu
చదువే పద్ధతిని మెరుగుపరచండి
మార్కుల షీట్ ఒక్కటే ఫైనల్ కాదు. అది ఒక సూచనగా మాత్రమే భావించండి. ఏ సబ్జెక్టుల్లో వీక్ గా ఉన్నారో చూసి ట్యూటర్ సహాయం తీసుకోండి.
Telugu
ప్రోత్సహించండి
మార్కులే జీవితానికి కొలమానం కాదని పిల్లలకి చెప్పండి. వారి ఇతర ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రశంసించండి. దానివల్ల వారు తమ మీద నమ్మకం కోల్పోకుండా ఉంటారు.
Telugu
ముందుకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి
పిల్లలతో కలిసి కూర్చుని ఎప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి తెలిపే ఒక టైమ్ టేబుల్ తయారు చేయండి. మీరు కూడా కొంత సమయం వారితో కలిసి కూర్చోండి. దానివల్ల వారు ఒంటరిగా లేరని భావిస్తారు.