Parenting Tips: పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవి

Published : May 13, 2025, 01:40 PM IST

పిల్లల్లో మెదడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా 1-3 సంవత్సరాల వయసులో బ్రెయిన్ డెవలప్ అయ్యే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వారికి పోషకాలతో నిండిన ఆహారం అందించాలి. అలా అందించకపోతే పోషకాల లోపం శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది.  

PREV
15
 Parenting Tips: పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే పెట్టాల్సిన ఫుడ్స్ ఇవి
kids eating

చిన్న పిల్లలు కొత్త విషయాలను చాలా తొందరగా నేర్చుకుంటారు. పిల్లలు అలా నేర్చుకుంటూ ఉంటే పేరెంట్స్ కి చాలా ఆనందంగా ఉంటుంది. అయితే, వారు అలా కొత్త కొత్త విషయాలను చాలా తొందరగా నేర్చకోవాలంటే.. వారి మెదడు అభివృద్ధి సరిగా ఉండాలి. అలా మెదడు చురుకుగా పని చేయాలి అంటే, వారికి సరైన ఆహారం అందించాలి. 

25
kids eating

పిల్లల్లో మెదడు అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా 1-3 సంవత్సరాల వయసులో బ్రెయిన్ డెవలప్ అయ్యే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో వారికి పోషకాలతో నిండిన ఆహారం అందించాలి. అలా అందించకపోతే పోషకాల లోపం శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది.

35

మెదడు అభివృద్ధికి ముఖ్యమైన పోషకాలు:
కోలిన్

ఫోలేట్

అయోడిన్

ఐరన్

ఒమేగా-3 కొవ్వులు

ప్రోటీన్

విటమిన్లు A, D, B6, B12

జింక్
 

45

ఈ పోషకాలు ఉన్న ఉత్తమ ఆహారాలు:
1. గుడ్లు
కోలిన్, B12, ప్రోటీన్ వంటి మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. రోజుకు రెండు గుడ్లు చాలు చిన్న పిల్లల రోజువారీ కోలిన్ అవసరాన్ని తీర్చడానికి.

2. సీఫుడ్
సాల్మన్, టిలాపియా, రొయ్యలు వంటి తక్కువ పాదరసం కలిగిన చేపలు ఐరన్, జింక్, ఒమేగా-3లను అందిస్తాయి. ఇవి వారంలో 2-3 సార్లు ఇవ్వొచ్చు.

3. ఆకుకూరలు..
ఆకుకూరలను కచ్చితంగా పిల్లలకు ఇవ్వాలి. వారు తినడానికి ఇష్టపడకపోతే వారు తినే వాటిలో వీటిని కలిపి అందించడానికి ప్రయత్నించాలి. పాలకూర, తోటకూర వంటివి ఫోలేట్, ఐరన్‌కు మంచి మూలాలు. ఇవి స్మూతీ లేదా పాస్తాలో కలిపి తినిపించవచ్చు.

55

4. లీన్ బీఫ్ / మాంసం ప్రత్యామ్నాయాలు
ఐరన్, జింక్ కోసం లీన్ బీఫ్ లేదా బ్లాక్ బీన్ బర్గర్లు మంచి ఎంపికలు.

5. పెరుగు
ఇదొక మంచి ప్రోటీన్ , అయోడిన్ మూలం. తీపిగా ఉండటం వల్ల పిల్లలకు సులభంగా ఇష్టపడతారు.

6. గింజలు & విత్తనాలు
గింజలు, విత్తనాలు పిల్లల డైట్ లో భాగం చేయాలి. పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడ్డాలంటే, పీనట్ బటర్ , డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి అందించాలి. ఇవి  ఇవి జింక్, ప్రోటీన్ అందిస్తాయి.మరీ చిన్న పిల్లలు అయితే..నట్స్ ని పౌడర్ లా చేసి వారి ఆహారంలో చేర్చవచ్చు.
 
7. బీన్స్
కిడ్నీ, పింటో, సోయా బీన్స్  లాంటివి పిల్లలకు అందించాలి. ఇవి ఐరన్, ప్రోటీన్, ఒమేగా-3 అందించే శాకాహార ప్రత్యామ్నాయాలు.

చిన్న వయసులో సరైన ఆహారం ద్వారా మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. ప్రతి తల్లిదండ్రుడూ ఈ పోషకాల ప్రాధాన్యతను గుర్తించి, పిల్లల భవిష్యత్తు బలోపేతానికి ఈ ఆహారాలను నిత్య జీవితంలో చేర్చాలి.
 

Read more Photos on
click me!

Recommended Stories