సాధారణంగా చాలామంది చిన్న పిల్లల్ని చూడగానే ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. కానీ పిల్లలకు ముద్దులు పెట్టేముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
చాలామందికి పిల్లల్ని చూడగానే ముద్దులు పెట్టే అలవాటు ఉంటుంది. కానీ పిల్లలకు ముద్దు పెట్టడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువును మొదటిసారి చూసినప్పుడు.. చాలామంది ఆ చిన్నారికి ముద్దు పెట్టడం మొదలుపెడతారు. కానీ అలా చేయకూడదు. ముద్దు పెట్టడం వల్ల పిల్లలకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.
26
బొబ్బలు రావడం..
పిల్లలకు ముద్దు పెడితే వారి నోట్లో బొబ్బలు రావచ్చు. దీనికి కారణం హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 అంటే HSV1. ఇది పెదవులపై లేదా నోటి చుట్టూ చిన్న బొబ్బలను కలిగిస్తుంది. ఇది తర్వాత ముక్కు, బుగ్గలు, నుదురు వంటి ముఖంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
36
ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం...
పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ముద్దులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ముఖం, చేతులు, కాళ్లకు ముద్దులు పెడితే ఆ అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది.
పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల అలెర్జీలు కూడా రావచ్చు. మీరు గ్లూటెన్ ఉన్న లిప్ స్టిక్ పెట్టుకుని పిల్లలకు ముద్దు పెడితే.. అది పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల "మోనోన్యూక్లియోసిస్" అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ముద్దు పెట్టుకునేటప్పుడు పిల్లల నోట్లోకి లాలాజలం వెళ్లడం ఈ వ్యాధికి ప్రధాన కారణం. ఈ వ్యాధి వల్ల పిల్లలకు దురద, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు.
56
రోగనిరోధక శక్తి తగ్గుతుంది:
పిల్లలకు ముద్దులు పెట్టడం వల్ల వారి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ముద్దుల ద్వారా, క్రిములు పిల్లల శరీరంలోకి ప్రవేశించి.. వారి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి.
పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకితే వారికి జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇది వారికి అలసట కలిగిస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండలేరు.
66
ఏం చేయాలి?:
పిల్లలను ముట్టుకునే ముందు మీ చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రంగా కడుక్కోవాలి. అదే సమయంలో ఇతరులు పిల్లలకు ముద్దులు పెట్టకుండా చూసుకోవాలి. పిల్లల పరిశుభ్రత గురించి శ్రద్ధ వహించాలి. వారి చేతులు, నోరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.