పట్టుబట్టి సాధించిన ట్రంప్: ఈ హైడ్రోక్సీక్లోరోక్విన్ కరోనాకి ఎలా పనిచేస్తుంది?

First Published Apr 11, 2020, 1:37 PM IST

కరోనా కు సూపర్ డ్రగ్ గా పాపులర్ అవుతున్న ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటే ఏమిటి, దాన్ని దేనితో కలిపి ఇస్తున్నారు, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాము.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. మందులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.... హెచ్ఐవి మందులను ఇతరాత్రాలను కలిపి ఇస్తున్నారు. అంతే తప్ప.. ఈ వైరస్ కి అయితే ఇప్పటికింకా మందు రాలేదు. మనిషి రోగనిరోధక శక్తిని పెంచి ఈ వైరస్ పై పోరాటం చేయాలి కాబట్టి, హెచ్ ఐ వి కూడా ఇలానే మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి, అలా హెచ్ఐవి మందులను ఇస్తోంది ప్రభుత్వం.
undefined
ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ కి మందు కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వాక్సిన్ తయారీకి కనీసం ఇంకొక్క సంవత్సర కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కనీసం కొంతలో కొంత ఈ వైరస్ మహమ్మారి నుండి మనుషుల ప్రాణాలను కాపాడేలా మందును తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ.
undefined
ఇక గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ట్రంప్ తొలిసార్రి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని ట్వీట్ చేసాడో, ఆతరువాత భారత్ ను పంపించవలిసిందే అని అల్టిమేటం జారీచేయడం, ఆతరువాత ట్రంప్ స్వరం మార్చడం, భారత్ పంపించడం ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఇప్పుడు అందరికీ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనే టాబ్లెట్ పేరయితే సుపరిచితమయిపోయింది.
undefined
ఈ నేపథ్యంలో అసలు కరోనా కు సూపర్ డ్రగ్ గా పాపులర్ అవుతున్న ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటే ఏమిటి, దాన్ని దేనితో కలిపి ఇస్తున్నారు, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా తెలుసుకుందాము. వాస్తవానికి ప్రస్తుతం రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటుగా అజిత్రోమైసిన్ కలిపి ఇస్తున్నారు.
undefined
మలేరియాను నయం చేసేందుకు ఈ టాబ్లెట్ ను మనము వాడుతాము. మలేరియాను నయం చేయడానికే కాకుండా ఆర్తరైటిస్ నుండి కూడా ఉపశమనం కల్పించేందుకు ఈ టాబ్లెట్ ను వాడతారు. ఇప్పటికి... ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని ఎలా  నయం చేస్తుందో తెలియదు. కానీ ఇప్పటివరకు జరిగిన పరిశోధనల నుండి సేకరించిన సమాచారం మేరకు, మనిషిలోని రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా ఈ టాబ్లెట్ ఆర్తరైటిస్ ని నయం చేస్తుందని తెలియవస్తుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ లో ఉన్న ఈ గుణమే ఇక్కడ పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది.
undefined
మలేరియా వైరస్ వల్ల కలగకపోయినా... కరోనా కు దెగ్గర చుట్టమైన సార్స్ ను ఎదుర్కోవడంలో ఈ క్లోరోక్విన్ విజయవంతమైందని కొన్ని రీసెర్చులు ప్రకటించాయి. ఇప్పటికి పూర్తిగా అందరి ఆమోద ముద్ర మాత్రం పడలేదు.
undefined
ఈ  క్లోరోక్విన్ తోపాటుగా అజిత్రోమైసిన్ ని కలిపి తీసుకున్నప్పుడు కరోనా ను సమర్థవంతంగా ఎదురుకోవొచ్చునని ఇటు ఫ్రెంచ్ పరిశోధనయినా, ట్రంప్ అయినా చెప్పడం జరిగింది. మామూలుగా అజిత్రోమైసిన్ ఒక ఆంటిబయోటిక్. దీనిని రకరకాల ట్రీటుమెంటుల్లో వాడినప్పటికీ... బ్రాంకైటీస్, న్యుమోనియా కేసుల్లోనూ ఈ మందును మనం వాడతాము. ఈ మందును ఇప్పుడు అదే న్యుమోనియా లక్షణాలు కలిగిన కరోనా ను ఎదుర్కొనేందుకు వాడుతున్నారు.
undefined
మొత్తానికి ఇంకా పూర్తిస్థాయిలో ఇవే మందులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించకపోయినా... మహమ్మారి ఇలా విజృంబిస్తున్నవేళ కనీసం ప్రాణాలు కాపాడడానికైనా ఈ మందులను వాడాలని సదరు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి.
undefined
ఈ మందులను ప్రస్తుతానికి రోగులతోపాటుగా కరోనా వైరస్ వచ్చిన రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లకు ఇస్తున్నారు. కరోనా పేషెంట్ల కుటుంబసభ్యులకు కూడా ముందస్తుగా ఇస్తున్నారు. హెల్త్ వర్కర్లకందరూ ఈ వైరస్ బారిన అధికంగా పోరాడే ఆస్కారం ఉంది కాబట్టి వారందరికీ కూడా ఈ మాత్రలను ఇస్తున్నారు.
undefined
భారతదేశం బల్క డ్రగ్ తయారీ రాజధానిగా ఇప్పటికే ప్రపంచంలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇప్పుడు మనం అన్ని దేశాలకు ఈ మాత్రలను సప్లై చేస్తున్నాము. ఇలా విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల మన దేశంలో ఈ మాత్రల కొరత ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు.
undefined
ఇకపోతే ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ని పరిగణలోకి తీసుకోకుండానే ట్రంప్ ముందుకెళుతున్నాడు. ఈ మందు వల్ల కండరాలు బలహీనపడి ఆస్కారం ఉంది. కండ్లలోని రెటీనా కు కూడా డామేజ్ జరిగే ప్రమాదం ఉంది. నరాల డామేజ్ కి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
undefined
ఇప్పటికిప్పుడు ఈ డ్రగ్ వల్ల ఎంతనేర ప్రయోజనం చేకూరుతుందో ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు కూడా ఎలుకలపై మాత్రమే పరిశోధనలు చేసారు. కానీ మనుషుల మీద ఈ మందు ఎలా పని చేస్తుంది అనేది ఇంకా ధృవీకృతమవలేదు.
undefined
click me!