సూర్య (Suriya) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘కంగువా’ (Kanguva). ఈ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం తమిళ,తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు సినిమాకి భారీ హైప్ ఉంది. కానీ మార్నింగ్ షేక్ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది.
దర్శకుడు శివ (Siva) మంచి కథని తీసుకున్నప్పటికీ దానిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అనే కంప్లైంట్ ఆడియన్స్ నుండి అందింది. అయితే ముందు నుండి ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్ బాగా ఉన్నాయి.