జైలు నుండి విడుదలయ్యాక మొదటిసారి అరెస్ట్ పై నోరు విప్పిన జానీ మాస్టర్, ఆమెపై కీలక కీలక కామెంట్స్!

First Published | Nov 19, 2024, 7:33 AM IST

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. బటయకు వచ్చాక ఆయన మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. కీలక కామెంట్స్ చేశారు. 
 

Jani master

జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడు. మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేశాడంటూ, తన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో జైలు పాలైన జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆయన మీడియా ముందుకు రాలేదు. 

Jani Master National Award

జైలు నుండి బయటకు వచ్చాక జానీ మాస్టర్ మొదటిసారి పబ్లిక్ లో కనిపించారు. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ మూవీ  ప్రీ రిలీజ్ వేడుకకు మాజీ మంత్రి రోజా, శివ బాలాజీ, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, అదిరే అభితో పాటు పలువురు సెలెబ్స్ హాజరయ్యారు. జానీ మాస్టర్ సైతం తన భార్యతో పాటు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడారు. ఇక్కడున్న వాళ్లంతా కష్టపడి ఒక్కోమెట్టు ఎదుగుతూ వచ్చినవారే. అందుకే నా వంతు సపోర్ట్ ఇవ్వాలని ఈ వేడుకకు వచ్చానని అన్నారు. రాకింగ్ రాకేష్ భార్య సుజాతను ఈ సందర్భంగా కొనియాడారు. ప్రతి భర్త సక్సెస్ వెనుక భార్య ఉంటుంది. అది నిజం అన్నారు. 


Jani Master

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ తనకు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య నాకు కొన్ని జరిగాయి. నా భార్యను నేను అప్రిషియేట్ చేస్తాను. ఆమె ఒక వెన్నెముక లాగా, స్తంభం లాగా నిలబడింది. ప్రతి ఒక్క భార్యకు ధన్యవాదాలు. మీరు ఒక తల్లిలా, చెల్లిలా భర్తలకు అండగా నిలుస్తున్నారు, అని జానీ మాస్టర్ అన్నారు. 

రాకింగ్ రాకేష్ ఇంత పెద్ద సినిమా తీయడం వెనుక సుజాత సపోర్ట్ ఉందని అన్నారు. కేసీఆర్ మూవీ మంచి విజయం సాధించాలి. వారి కష్టానికి కాసుల రూపంలో వసూళ్లు కురవాలని జానీ మాస్టర్ కోరుకున్నారు. జానీ మాస్టర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ అరెస్ట్ ను భార్య అయేషా తీవ్రంగా ప్రతిఘటించిన సంగతి తెలిసిందే.. 

Jani Master

జానీ మాస్టర్ అరెస్ట్ ఉదంతాన్ని పరిశీలిస్తే..  మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. అతని మీద  పోక్సో(POCSO) కేసు సైతం నమోదైంది. గతంలో తన అసిస్టెంట్ గా పని చేసిన, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో జానీ మాస్టర్ పరార్ అయ్యాడు.

సెప్టెంబర్ 19వ తేదీ గురువారం జానీ మాస్టర్ ని గోవాలో  సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్ ని హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ కి తరలించారు. రాజేంద్రనగర్ సిసిఎస్ లో జానీ మాస్టర్ ని ఉంచారు.అక్కడ ప్రాథమిక విచారణ జరిగింది. 
 

అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడు  జానీ మాస్టర్ ను నార్సింగ్ పోలీసులు హాజరుపరిచారు.  

ఉప్పరపల్లి కోర్ట్ జానీ మాస్టర్ కి రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) యాక్ట్ నమోదు చేయడంతో, బెయిల్ రాలేదు. దాదాపు 36 రోజులు జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. ప్రభుత్వం జానీ మాస్టర్ కి ప్రకటించిన నేషనల్ అవార్డు సైతం రద్దు చేసింది. 

సన్నిహితులతో జానీ మాస్టర్ తన ఆవేదన వెళ్ళగక్కాడట. జైలులో నరకం చూశాను. ఆహారం బాగోలేదు. మనిషన్న వాడు ఎవడు జైలుకి వెళ్ళకూడదు. ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. కొన్ని రోజులు మనిషిని కాలేను. రెండు రోజుల వరకు ఎవరితో మాట్లాడను అన్నారట. 
 

Latest Videos

click me!