తెలంగాణలో సీన్ రిపీట్: కేటీఆర్, హరీష్ రావులకు పరీక్ష

First Published | Oct 25, 2020, 9:15 AM IST

ఒకపక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు, మరోపక్క దుబ్బాక ఉపఎన్నికలతో రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ వీటిపైన్నే దృష్టిసారించారు. అందరూ కూడా వీటిగురించే చర్చించుకుంటున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే... సరిగ్గా 4 సంవత్సరాల కిందటి సీన్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపించకమానదు.

తెలంగాణలో రాజకీయ వాతావరణం బాగావేడెక్కింది. కరోనా మహమ్మారి ఒకపక్క కోరలు చాస్తూనే ఉన్నా, మరోపక్క వరదలు ముంచెత్తుతున్నప్పటికీ.... రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కి మాత్రం ఏ మాత్రం కొదవలేదు. అధికార తెరాస,ప్రధాన ప్రతిపక్షం తామే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు కత్తులు దూస్తున్నాయి.
undefined
ఒకపక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు, మరోపక్క దుబ్బాక ఉపఎన్నికలతో రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీవీటిపైన్నే దృష్టిసారించారు. అందరూ కూడా వీటిగురించేచర్చించుకుంటున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే... సరిగ్గా 4 సంవత్సరాల కిందటి సీన్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపించకమానదు. నాలుగు సంవత్సరాల కింద ఎలా అయితే ఇద్దరు నాయకులు తెరాస ను ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేశారో ఇప్పుడు కూడా అదే నాయకులూ మరోమారు తెరాస ను ఒడ్డునపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
undefined

Latest Videos


వారే కేటీఆర్, హరీష్ రావు. 2016లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస కు అఖండ విజయం సాధించిపెట్టిన కేటీఆర్.... ఇక అప్పటినుండి రెట్టించిన జోష్ తో దూసుకుపోతున్నారు. ఎవరి మద్దతు అక్కర్లేకుండానే బల్దియాపై గులాబీ జెండా రెపరెపలాడింది. 99 సీట్లను తెరాస సాధించడంలో కేటీఆర్ అవిరళకృషి దాగుందంటే అతిశయోక్తి కాదు.
undefined
ఇక పార్టీలో ట్రబుల్షూటర్ గా పేరున్న నేత హరీష్ రావు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితికైనా చిటికెలో సమాధానం చెప్పడం మాత్రమే కాదు.... ఏ ఎన్నికైనా, ఉపఎన్నికైనా హరీష్ రావు దిగనంత వరకే ప్రత్యర్థులకు ఆశలు, ఒక్కసారి హరీష్ రావు రంగంలోకి దిగితే అక్కడ అవతలి పార్టీ అభ్యర్థి ఓటమి తథ్యం.
undefined
తెరాస కు ఎప్పుడైన క్లిష్టమైన స్థానాలు గెలవాలి అన్నప్పుడు హరీష్ రావు అక్కడ ప్రత్యక్షమవుతారు. 2018లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వంటి చరిష్మా ఉన్న నేతను హరీష్ రావు తన ఎత్తులు, పై ఎత్తులతో ఓటమిపాలు చేసారు.2014లో సైతం దుబ్బాకలాగానే నారాయణఖేడ్ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కృష్ణ రెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉపఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది.
undefined
నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1999 నుంచి 2014 వరకు అక్కడ వరుసగా కాంగ్రెస్ గెలుస్తూ వస్తుంది. అలాంటి నియోజకవర్గాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న తెరాస.. అందుకు తగ్గట్టుగా హరీష్ రావును రంగంలోకి దింపి అతనికి ఆ గురుతర బాధ్యతను అప్పగించింది.
undefined
మామూలుగా అప్పటివరకు ప్రజాప్రతినిధి మరణిస్తే వారి కుటుంబీకులను నిలబెట్టినప్పుడు ఇతర పార్టీలు పోటీనుంచి తప్పుకొని ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేవి. కానీ అప్పటి ప్రత్యేక రాజకీయ అవసరాల దృష్ట్యా కేసీఆర్ ఆ ఆనవాయితీకి చరమగీతం పాడారు. హరీష్ రావు ఎంట్రీతో అక్కడ సీన్ మారిపోయింది. అన్ని పక్కకుంచితే... సానుభూతి పవనాలతో అయినా కాంగ్రెస్ విజయం సాధించేస్తుందన్న వారి ఆశలకు గండి కొడుతూ... అక్కడ గులాబీ జెండాను రెపరెపలాడించాడు.
undefined
ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మరొక్కమారు అదే పరిస్థితి కనబడుతుంది. ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు. మరోపక్క సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక స్థానానికి ఉపఎన్నిక. మరోసారి ఈ రెండు సవాళ్ళను ఎదుర్కునే గురుతర బాధ్యతను కేసీఆర్ మరోమారు ఈ ఇద్దరు నేతలకు అప్పగించారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న మాస్ నేత హరీష్ రావును దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను అప్పగిస్తే... క్లాస్ నేత కేటీఆర్ కి జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు కేసీఆర్. చూడాలి ఈ పర్యాయం ఈ ఇద్దరు నాయకులు ఎలా మరోసారి రాజకీయంగా చక్రం తిప్పుతారో..!
undefined
దుబ్బాకలో విపక్షాలు జోరుమీద ఉన్నప్పటికీ... దుబ్బాక తెరాస కంచుకోట. అందునా అధికారంలో ఉండడం వల్ల ఉపఎన్నిక వేళ కొంత దోహదపడే ఆస్కారం ఉంది. కానీ గ్రేటర్ ఎన్నిక అలా కాదు. అసలే కరోనా వైరస్ ని హ్యాండిల్ చేసిన తీరుపై నగర వాసులు ఒకింత అసంతృప్తిగా ఉండగా, కొత్తగా వచ్చిపడ్డ వరదల విపత్తు.
undefined
దుబ్బాకలో విపక్షాలు జోరుమీద ఉన్నప్పటికీ... దుబ్బాక తెరాస కంచుకోట. అందునా అధికారంలో ఉండడం వల్ల ఉపఎన్నిక వేళ కొంత దోహదపడే ఆస్కారం ఉంది. కానీ గ్రేటర్ ఎన్నిక అలా కాదు. అసలే కరోనా వైరస్ ని హ్యాండిల్ చేసిన తీరుపై నగర వాసులు ఒకింత అసంతృప్తిగా ఉండగా, కొత్తగా వచ్చిపడ్డ వరదల విపత్తు.
undefined
click me!