‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published : Jan 23, 2025, 12:01 PM IST

వెన్నెల కిశోర్ హీరోగా నటించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఓటిటి  స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. 1991 నాటి రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజున జరిగిన మరో హత్య రహస్యాన్ని ఛేదించే కథ ఇది.

PREV
15
 ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
vennela kishore, Srikakulam Sherlock Holmes, OTT

వెన్నెల కిశోర్‌ ఇటీవలే హీరోగా  ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’తో క్రిస్మస్‌ బరిలో వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయతగా పని చేసిన రైటర్‌ మోహన్‌ దీనికి దర్శకుడిగా వ్యవహరించడం.. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ఆయ్‌’, ‘క’ లాంటి విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన వంశీ నందిపాటి దీన్ని విడుదల చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనుకున్న స్దాయిలో ఆ సినిమా వర్కవుట్ కాలేదు.ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమైంది.
 

25
vennela kishore, Srikakulam Sherlock Holmes, OTT


 తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) జనవరి 24వ తేదీ నుంచి (srikakulam sherlock holmes ott release) అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘రహస్యాన్ని ఛేదించడానికి సిద్ధంకండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ రెడీ అయింది’ అని పేర్కొంది.
 

35
vennela kishore, Srikakulam Sherlock Holmes, OTT


కథేంటంటే: ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్‌ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్‌(అనీష్‌ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్‌ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్‌ స్టేషన్‌లోనే ఉండాల్సి వస్తోంది. 

45

వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్‌ డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌(వెన్నెల కిశోర్‌)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ,  సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి పట్నాయక్‌(బాహుబలి ప్రభాకర్‌)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్‌ షెర్లాక్‌ అనుమానిస్తాడు.

55

 వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు.  వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్‌ షెర్లాక్‌ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్‌ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. 

Read more Photos on
click me!

Recommended Stories