Modi: మోదీ వ‌చ్చే ఏడాది రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోనున్నారా.? కొత్త చ‌ర్చ లేవ‌నెత్తిన మోహ‌న్ భగ‌వ‌త్ వ్యాఖ్య‌లు

Published : Jul 10, 2025, 02:37 PM ISTUpdated : Jul 10, 2025, 05:54 PM IST

ప్ర‌తీ ఉద్యోగంలో ప‌ద‌వి విర‌మ‌ణ అనేది ఉంటుంది ఒక్క రాజ‌కీయంలో త‌ప్ప‌. అయితే 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలన్న నిబంధన ఒకటి బీజేపీ అమలు చేస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి చ‌ర్చ‌కు దారి తీశాయి. 

PREV
15
మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేశారు. “వ్యక్తి 75 ఏళ్ల వయస్సుకి చేరిన తరువాత తన బాధ్యతలు బదిలీ చేసి విశ్రాంతి తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం సాధారణ సందేశంగా కాకుండా, ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. 

ఎందుకంటే ఆయన వయస్సు ప్రస్తుతం 74. దీంతో వ‌చ్చే ఏడాది ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్నారా అన్న చ‌ర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ విధానాలకేనా? లేక తన భవిష్యత్తుపై సంకేతమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

25
వచ్చే ఏడాది రిటైర్ అవుతారా?

మోహన్ భాగవత్ 1950 సెప్టెంబర్ 11న జన్మించారు. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆయన వయసు 74. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు ఆయన 75 సంవత్సరాలు నిండనున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యల ప్ర‌కారం ఆయన స్వయంగా పదవి వీడతారా? అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి.

35
ఆర్ఎస్ఎస్ కొత్త ఛీఫ్ ఎవరు?

భగవత్ రిటైర్మెంట్ తీసుకుంటే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పటి నుంచే చర్చకు వస్తోంది. సహసర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే, క్రియాశీల నాయకులైన కృష్ణ గోపాల్, భాయ్యాజీ జోషి వంటి నేతల పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్‌లో నాయకత్వ మార్పులు అంతగా బహిరంగంగా జరగవు గానీ, గతంలో హెడ్గేవార్, గోల్వాల్కర్ తర్వాతుగా వచ్చిన మార్పులను చూస్తే సుదీర్ఘ ఆలోచనలతోనే జరుగుతాయని తెలుస్తోంది.

45
మోదీకి వర్తించదా..?

మోహన్ భగవత్ వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. “భగవత్ 75 ఏళ్ల వయస్సులో రిటైర్ అవాలనుకుంటే, అదే నియమాన్ని మోదీకి కూడా వర్తింపజేయాలి. ఆయన కూడా ఇప్పుడు 74 ఏళ్లే” అని అన్నారు. అలాగే బీజేపీ రూపొందించిన 75 ఏళ్ల రిటైర్మెంట్ పరంపరను మోదీకి కూడా వర్తింపజేయాలని రౌత్ డిమాండ్ చేశారు.

55
అమిత్‌షా కూడా కీల‌క వ్యాఖ్య‌లు

ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్ పర్యటనలో అమిత్ షా కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న రెండు ద‌శాబ్ధాల రాజ‌కీయ జీవితం చాల‌నిపిస్తోందని. రాజకీయ విరమణ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవడంతో పాటు ప్రకృతి వ్య‌వ‌సాయంపై దృష్టి పెడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా? లేక పార్టీలో ఏదైనా మార్పున‌కు సంకేతమా? అనే సందేహాలు కూడా వ‌చ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories