Inspiring Story : ఎంత గొప్పపని సామీ... అతడు సంపదలో పేదవాడేమో కానీ పెద్ద మనసున్నవాడు

Published : Jul 09, 2025, 10:10 PM IST

అతడు కూలీయే కావచ్చు... సంపాదన తక్కువే ఉండవచ్చు. కానీ పెద్ద మనసున్నవాడు. చదువుకునేందుకు పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి కూలీచేసి సంపాదించిన డబ్బులతో సైకిళ్లు కొనిచ్చాడు. మనసుకు హత్తుకునే ఈ కథనాన్ని ఇక్కడ చదవండి.

PREV
15
ఎంత గొప్పవాడివయ్యా..!

అతడి బతుకు బండి సాగాలన్నా, కడుపు నిండాలన్నా రోజూ కష్టపడి పని చేయాల్సిందే. రెక్కడితే కాని డొక్కాడదు… పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అయినా ఆయన మంచి మనసు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.

తన కూలీ డబ్బులతో ఊరిలోని 11 మంది పేద పిల్లలకు సైకిళ్ళు కొనిచ్చి అందరి మనసులు గెలుచుకున్నాడు. పేదవాడైనా మంచి మనసున్నవాడు అని నిరూపించుకున్నాడు. ఆయనే కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా మల్కందిన్ని గ్రామానికి చెందిన ఆంజనేయ.

25
కూలీ డబ్బులతో సైకిళ్ళ పంపిణీ

పెద్ద పెద్ద వ్యాపారస్తులు తమ సంపాదనలో కొంత డబ్బు దానం చేయడం సర్వసాధారణం. ఎందుకంటే వారికి డబ్బుకు కొదవుండదు. కొందరు మంచి మనసుతో చేస్తే ఇంకొందరు పన్నులు తప్పించుకోవడానికి ఇలాంటి సామాజిక సేవ చేస్తారు. అయితే కూలీ పని చేసే వ్యక్తి తన దగ్గరున్న డబ్బుతో 11 మంది పిల్లలకు సైకిళ్ళు కొనివ్వడం అంటే మామూలు విషయం కాదు.

35
పిల్లలకు సైకిళ్ళు ఎందుకు కొనిచ్చాడు?

ఆంజనేయ ఉండే మల్కందిన్ని గ్రామంలో హైస్కూల్ లేదు. పిల్లలు పది కిలోమీటర్లు నడిచి వేరే ఊరికి వెళ్ళాలి. చాలామంది పిల్లలు చదువుపై మక్కువతో ఇలా రోజూ కిలోమీటర్ల కొద్ది నడిచేవారు. 

 రోజూ కూలీ పనికి వెళ్ళే ఆంజనేయకు పిల్లలు ఇంత దూరం నడిచి వెళ్లడం చూసి చలించిపోయాడు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఎవరి సహాయం కోసం ఆగకుండా తన దగ్గరున్న డబ్బుతో 11 మంది పిల్లలకు సైకిళ్ళు కొనిచ్చాడు.

45
పిల్లల చదువు కోసమే ఇదంతా...

మల్కందిన్ని నుంచి హైస్కూల్ ఉన్న హేమనూరుకు బస్సు సౌకర్యం కూడా లేదు. అందుకే చాలా మంది పిల్లలు చదువు మానేస్తున్నారు. "మా ఊరి పిల్లల కష్టాలు చూడలేకపోయాను. ఈ దూరం వల్లే ఏటా 15 నుంచి 20 మంది పిల్లలు చదువు మానేస్తున్నారు. అందుకే వాళ్ళు చదువుకోవాలని సైకిళ్ళు కొనిచ్చాను. నా చిన్న సాయంతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటే నాకింకేం కావాలి?" అని ఆంజనేయ చెబుతున్నాడు. 

55
అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు సైకిళ్ళు

గత మార్చిలో ఆంజనేయ హేమనూరు స్కూల్‌కి వెళ్లి 11 సైకిళ్ళు ప్రధానోపాధ్యాయుడికి ఇచ్చాడు. ఆరుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలకు ఈ సైకిళ్ళు అందజేశారు. దీంతో పిల్లలు పది కిలోమీటర్లు నడిచే కష్టం తప్పింది.

రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలో 186 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 100 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు... దీంతో చాలా మంది పిల్లలు హైస్కూల్ చదువు మానేస్తున్నారు. ప్రభుత్వం గతంలో మాదిరిగా మళ్ళీ ఉచిత సైకిళ్ళు ఇస్తే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అక్కడి ప్రజల అభిప్రాయం. అయితే అంజనేయ వంటివారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తమకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories