Published : Jun 17, 2025, 02:36 PM ISTUpdated : Jun 17, 2025, 02:38 PM IST
ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిన్ కోడ్ ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఆధారంగా ఉత్తరాలు పంపిస్తుంటారు. అయితే మన దేశంలోని గోవాకు, అంటార్కిటాకు ఒకే పిన్ కోడ్ ఉందన్న విషయం మీకు తెలుసా.?
గోవా అందమైన సముద్ర తీరాలకు, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మరోవైపు, అంటార్కిటికా – మంచుతో కప్పబడిన, మానవ నివాసానికి అనుకూలంగా లేని భూమి. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే ఈ ఖండంపై నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ఈ రెండు పూర్తిగా భిన్నమైన ప్రదేశాలకు ఒకే పిన్ కోడ్ ఉండటం ఆశ్చర్యమే కదూ!
25
ఒకే పిన్ కోడ్ ఎందుకు?
గోవా, అంటార్కిటికాకు 403001 అనే పిన్ కోడ్ ఉంటుంది. ఇలా రెండు ప్రాంతాలకు ఒకే పిన్ కోడ్ ఎందుకనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 1983లో భారత ప్రభుత్వం అంటార్కిటికాలో “దక్షిణ గంగోత్రి” అనే మొదటి శాస్త్రీయ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది.
ఇందులో పని చేసే పరిశోధకులకు తమ కుటుంబాల నుంచి లేఖలు అందేలా 1984లో అక్కడ పోస్టాఫీసు ప్రారంభించారు. కానీ అది స్థానికంగా కాకుండా గోవా ఆధారంగా పనిచేస్తుంది.
35
అంటార్కిటికాకు లేఖలు ఎలా చేరేవి?
మీరు ఎవరికైనా అంటార్కిటికాలో లేఖ రాస్తే, దానిపై “Antarctica” అని రాసి, 403001 అనే పిన్ కోడ్ పెట్టాలి. ఈ లేఖ మొదట గోవాలోని వాస్కోడగామా ఉన్న National Centre for Polar and Ocean Research (NCPOR) కి చేరుతుంది. అక్కడి నుంచి ఆ లేఖలు అంటార్కిటికాలోని శిబిరానికి చేరతాయి.
గోవాలోని NCPOR భారతదేశం నుంచి అంటార్కిటికాకు జరిపే అన్ని యాత్రలకు, లాజిస్టిక్ కార్యకలాపాలకు కేంద్రంగా పని చేస్తుంది. అంటే, శాస్త్రవేత్తలు, సరఫరా, పరికరాలు అన్నీ ఇక్కడ నుంచే పంపిస్తారు. అందుకే, ఆ పోస్టాఫీసు కూడా గోవా పిన్ కోడ్‌ను ఉపయోగించి పనిచేస్తోంది. దీని ద్వారా అక్కడికి వెళ్లే ఉత్తరాలు ఒకే మార్గం ద్వారా చేరుతాయి.
55
పోస్టల్ స్టాంపు ‘రద్దు’ ప్రక్రియ.
గోవాలోని NCPOR ఉత్తరాలపై పోస్టల్ స్టాంపును ‘రద్దు’ చేస్తుంది. దీని అర్థం ఆ స్టాంపును తిరిగి ఉపయోగించకుండా చెయ్యడం. ఇది అధికారికంగా ఆ లేఖని పంపిన ఆధారంగా నిలుస్తుంది. రద్దయిన ఈ ఉత్తరాలు ఆ తరువాత సరైన సమయంలో అంటార్కిటికాలలోని శిబిరంలో ఉన్న వ్యక్తుల వరకు చేరతాయి. ఈ విధంగా, భారతీయ పోస్టల్ వ్యవస్థ తెలివిగా పనిచేసి ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటికాలో కూడా పోస్టల్ సేవలను అందిస్తోంది.