Jobs: పది పాస్ అయితే చాలు, రూ.50వేలకుపైగా జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

Published : Jun 17, 2025, 10:36 AM IST

ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకున్న వారికి అదిరిపోయే అవకాశం, అది కూడా కేవలం పది పాసైతే చాలు. తమిళనాడులోని అరుళ్మిగు వనపత్రకాళి అమ్మన్ ఆలయంలో 58 వేల రూపాయాల జీతంతో ఎటువంటి రాత పరీక్ష లేని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

PREV
15
17 పోస్టుల కోసం

తమిళనాడు ప్రభుత్వ హిందూ మత ధార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అరుళ్మిగు వనపత్రకాళి అమ్మన్ ఆలయం (తేక్కంపట్టి, కోయంబత్తూర్ జిల్లా) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన హిందూ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 17 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది

25
ఖాళీలు, అర్హతలు:

 టికెట్ సెల్లర్, గార్డ్, గూర్ఖా, ఎవాలర్, లాండ్రీ వర్కర్, తిరువాలకు, పల్ప్ మేకర్, సబ్-కోయిల్ క్లర్క్, ఒడువర్, సబ్-కోయిల్ మెలఘు వంటి పోస్టులకే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఎక్కువగా 10వ తరగతి ఉత్తీర్ణత ప్రధాన అర్హతగా పేర్కొన్నారు. తమిళంలో చదవడం, వ్రాయడం రాబోయే ఉద్యోగానికి అవసరం. ఒడువర్, సబ్-కోయిల్ మెలఘు పోస్టులకు తేవారా పాఠశాలలో కనీసం 3 సంవత్సరాలు చదివిన సర్టిఫికేట్ ఉండాలి.

35
జీత వివరాలు:

పోస్టు ఆధారంగా జీతం రూ. 10,000 నుంచి రూ. 58,600 వరకు ఉంటుంది. ఉదాహరణకు, టికెట్ సెల్లర్, ఒడువర్ ఉద్యోగాలకు రూ. 18,500-58,600, లాండ్రీ వర్కర్‌కు రూ. 11,600-36,800, ఇతర పోస్టులకు రూ. 15,700-50,400 వరకూ జీతం చెల్లిస్తారు.

45
ఎంపిక విధానం:

 ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యగా ఉండాలి. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూకే ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము లేదు.

55
దరఖాస్తు వివరాలు:

 రూ. 100 చెల్లించి ఆలయ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీ జూన్ 15, 2025 ప్రారంభమై, జూన్ 30, 2025తో ముగుస్తుంది.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: అసిస్టెంట్ కమిషనర్/కార్యనిర్వాహక అధికారి, అరుళ్మిగు వనపత్రకాళి అమ్మన్ ఆలయం, తేక్కంపట్టి, నెల్లితురై P.O, మెట్టుపాలయం తాలూకా, కోయంబత్తూర్ జిల్లా - 641305.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది ఒక అరుదైన అవకాశం.

Read more Photos on
click me!

Recommended Stories