Who is Best PM of India: విద్యార్థుల హక్కులు, విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం పోరాడుతున్న సీజేపీ అభిజీత్ దీప్కే.. దేశంలో బెస్ట్ పీఎం, బెస్ట్ సీఎం ఎవరు అనేదానిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దేశంలో బెస్ట్ ప్రధాని ఆయనే.. అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఇప్పటివరకు పరిపాలించిన బెస్ట్ ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనే ఇప్పటివరకు దేశం చూసిన అత్యుత్తమ ప్రధాని అని ఆయన స్పష్టం చేశారు. ఒక మీడియాా ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీజేపీ నాయకులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ కూడా అభిజీత్ దీప్కే వ్యాఖ్యలతో ఏకీభవించారు. నెహ్రూ దేశంలోనే అత్యంత 'కూలెస్ట్' ప్రధాని అని దీప్కే అభివర్ణించారు.
24
అత్యుత్తమ ముఖ్యమంత్రులు వీరే
దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల గురించి అడిగిన ప్రశ్నకు అభిజీత్ దీప్కే ముగ్గురి పేర్లను ప్రస్తావించారు. తమిళనాడు మాజీ సీఎం ఎమ్‌కే స్టాలిన్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను ఆయన బెస్ట్ ముఖ్యమంత్రులుగా పేర్కొన్నారు.
స్టాలిన్ తమిళనాడు ఆర్థిక వ్యవస్థను ఎంతో మెరుగుపరిచారని కొనియాడారు. పినరయి విజయన్ కేరళ ఆరోగ్య రంగాన్ని అద్భుతమైన మోడల్‌గా తీర్చిదిద్దారని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో విద్యా వ్యవస్థ, వైద్య రంగాలలో గణనీయమైన మార్పులు తెచ్చారని ఆయన వివరించారు.
34
సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్
ఉపాధ్యాయుల దినోత్సవమైన సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలో భారీ మార్చ్ నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. జూలై 25న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పార్టీ ఆరోపించింది. ఈ మార్చ్‌ను ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువజన సంఘాలు, యువత ఈ శాంతియుత మార్చ్‌లో పాల్గొనాలని సీజేపీ పిలుపునిచ్చింది. నీట్ పరీక్షల వివాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలు, పోలీస్ చర్యల వల్ల బాధితులైన కుటుంబాలు ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తాయని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ తెలిపారు.
మరోవైపు, భారత్-రష్యా సంబంధాలపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో మాట్లాడిన ఆయన, జవహర్‌లాల్ నెహ్రూ, బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II మధ్య జరిగిన ఒక చరిత్రాత్మక సంభాషణను గుర్తుచేసుకున్నారు. 1952లో నెహ్రూ మహారాణితో మాట్లాడుతూ, "యువర్ మెజెస్ట్రీ, భారత్ ఎల్లప్పుడూ ప్రాథమికంగా రష్యా వైపే ఉంటుంది" అని చెప్పారని క్వీన్ ఎలిజబెత్ తనకు స్వయంగా చెప్పినట్లు జాన్సన్ వెల్లడించారు.
భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల మధ్య బలమైన సహకారం అవసరం అని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాలో భారత్ వహించిన పాత్రను ఆయన ప్రశంసించారు. బ్రెగ్జిట్ తర్వాత భారత్-బ్రిటన్ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని కూడా ఆయన పేర్కొన్నారు.