Non Veg Milk: నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి.? అమెరికా, భార‌త్ వాణిజ్యానికి ఇది ఎలా బ్రేక్ వేసింది.

Published : Jul 17, 2025, 03:49 PM IST

భారతదేశం, అమెరికా మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు “నాన్ వెజ్ మిల్క్” కారణంగా నిలిచిపోయాయి. పాలను మాంసాహారంగా పరిగణించే దృష్టికోణం వల్ల ఈ వివాదం ఏర్పడింది. భారత ప్రభుత్వం అమెరికా పాల దిగుమతులను తిరస్కరించడంతో ఇప్ప‌డీ అంశం చ‌ర్చ‌గా మారింది. 

PREV
15
నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి?

నాన్ వెజ్ మిల్క్ అంటే మాంసాహార ఆహారం తినే జంతువుల నుంచి వచ్చే పాలు. ముఖ్యంగా అమెరికాలో పశువులకు జంతు మూలాలపై ఆధారపడిన ఆహారాన్ని అందిస్తారు. వాటిలో పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, కుక్కలు వంటి జంతువుల భాగాలు, ఎముకలు, రక్తం ఆధారిత ప్రొటీన్‌లు ఉంటాయి. దీని వ‌ల్ల‌ ఆ పశువుల నుంచి వచ్చే పాలు పరోక్షంగా మాంసాహార మూలాలు కలిగినవిగా ప‌రిగ‌ణిస్తారు. అందుకే వీటిని "నాన్ వెజ్ మిల్క్"గా అభివర్ణిస్తారు.

25
భారత దేశ అభ్యంతరాలు ఏంటంటే.?

భారతదేశంలో పాలను పవిత్రమైనవిగా భావిస్తారు. మ‌రీ ముఖ్యంగా గోవులను పూజించే సంస్కృతి కారణంగా పాల పరిశ్రమ ఎంతో ప్రత్యేకత సంత‌రించుకుంది. అమెరికాలో ఉండే జంతు ఆధారిత ఫీడ్ పద్ధతులు భారత సంప్రదాయాలకు వ్య‌తిరేకంగా ఉండటంతో, భారత ప్రభుత్వం వీటిని దేశంలో ప్రవేశ పెట్టేందుకు నిరాకరిస్తోంది. ఈ విషయంలో రైతులు, పాడి రైతులు కూడా మోదీ సర్కారుకు త‌మ మ‌ద్ధ‌తును ప్ర‌క‌టిస్తున్నారు.

35
అమెరికా ప్లాన్ ఏంటంటే.?

ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారైన భారతదేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమకు ముఖ్య స్థానం ఉంది. ఏడాదికి 239 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరగడమే కాకుండా, దాదాపు 8 కోట్ల మంది ప్రత్యక్షంగా ఉపాధిని పొందుతున్నారు. 

ఈ విస్తృత మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకొని అమెరికా కంపెనీలు భారత దేశంలోకి తమ పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. అయితే స్థానిక రైతుల జీవనాధారంపై ప్రభావం పడకుండా ఉండేందుకు భారత్ దీనిని నిరాకరిస్తోంది.

45
FSSAI ప్ర‌తిపాద‌న ఏంటంటే.?

భారత ఆహార భద్రతా సంస్థ FSSAI 2021-22లో ఒక ప్రతిపాదన చేసింది. దానిప్రకారం జంతు ఆధారిత ఫీడ్‌తో ఉత్పత్తి అయ్యే పాల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని సూచించింది. అంటే, అలాంటి పాలు మార్కెట్‌లో "నాన్ వెజ్ మిల్క్"గా గుర్తించాలన్నమాట. అయితే అమెరికా కంపెనీలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించాయి. 

ఈ పాల‌ను శాఖ‌హారంగా గుర్తించాల‌ని వాదించాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం జంతు ఆహారపు మూలాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉంది.

55
అమెరికా పాలు భార‌త్‌లోకి వ‌స్తే ఏమ‌వుతుంది.?

భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. జాతీయ స్థాయిలో జీడీపీకి దాదాపు 3% వాటా పాల పరిశ్రమ నుంచే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పాల ఉత్పత్తుల ప్రవేశం వల్ల స్థానిక రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పైగా విదేశీ పాలలో ఉన్న ఆచరణలు భారత సంప్రదాయాలను దెబ్బతీయవచ్చన్న ఆందోళన ప్రభుత్వానికి ఉంది.

 అందుకే మోదీ సర్కారు అమెరికా డిమాండ్‌ను నిరాకరించడం ద్వారా దేశీయ రైతులను, సాంస్కృతిక విలువలను కాపాడే దిశగా నిర్ణయం తీసుకుంది. మ‌రి దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories