Union Budget: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.? రూ. 5వేల పెన్షన్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న

Published : Jan 30, 2026, 04:59 PM IST

Union Budget: మ‌రో రెండు రోజుల్లో కేంద్ర బ‌డ్జెట్ 2026ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. దీంతో ఈ బ‌డ్జెట్‌పై చాలా మంది ఎన్నో ఆశ‌లు పెట్టున్నారు. ఇందులో పీఎఫ్ ఖాతాదారులు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

PREV
15
EPFO ఖాతాదారులపై బడ్జెట్ ఆశలు

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ సదుపాయం పొందుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026లో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. పన్ను భారం తగ్గింపు, పెన్షన్ పెంపు వంటి అంశాలపై ఉద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి.

25
పీఎఫ్ విత్‌డ్రా ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో ఉద్యోగి వార్షిక చందా రూ.2.5 లక్షలు దాటితే వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. యజమాని వాటా లేనప్పుడు రూ.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. ఈ పరిమితిని పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.10 లక్షల వరకు పెంచే అంశంపై కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

35
ఐదేళ్ల నిబంధనకు సడలింపు

ఇప్పటి వరకు ఐదేళ్లు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతా కొనసాగితేనే విత్‌డ్రాపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం ఉద్యోగాలు తరచూ మారుతున్న పరిస్థితుల్లో ఇది భారంగా మారింది. అందుకే ఈ గడువును మూడేళ్లకు తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. బడ్జెట్‌లో ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

45
కనీస వేతన పరిమితి పెరిగే ఛాన్స్

ఈపీఎఫ్ కనీస వేతన పరిమితి ప్రస్తుతం రూ.15 వేలుగా ఉంది. దీన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. బడ్జెట్ 2026లో ఈ పరిమితిని రూ.21 వేల వరకు పెంచే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అలా జరిగితే మరింత మంది ఉద్యోగులు ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది

55
పెన్షన్ పెంపుపై ఉద్యోగుల ఎదురుచూపు

ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రస్తుతం లభిస్తున్న కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. ఈ మొత్తాన్ని గత 11 ఏళ్లుగా పెంచలేదు. జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కనీస పెన్షన్‌ను రూ.5 వేల వరకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఈ అంశానికి ప్రాధాన్యం దక్కుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories