TVK Vijay: స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించ‌డ‌మే మా ల‌క్ష్యం.. విజ‌య్ పార్టీ ఎమ్మెల్యే వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

Published : May 14, 2026, 04:41 PM IST

TVK Vijay: తమిళనాడులో సనాతన ధర్మం అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. నటుడు విజ‌య్ టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీఎమ్ఎస్ ముస్త‌ఫా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.? 

PREV
14
పెరియార్, అంబేద్కర్ సిద్ధాంతాలే మా మార్గం: ముస్తఫా

మీడియాతో మాట్లాడిన TVK ఎమ్మెల్యే వీఎంఎస్ ముస్తఫా, తమ పార్టీ పెరియార్ ఈవీ రామస్వామి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తోందన్నారు. “మేమూ పెరియార్, అంబేద్కర్ భావజాలాన్ని నమ్ముతున్నాం. సనాతనాన్ని నిర్మూలించేందుకు మేమూ పోరాటంలోకి దిగాం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

24
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల తర్వాత మళ్లీ రచ్చ

ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విజ‌యం తెలిసిందే. “ప్రజలను విభజించే సనాతన ధర్మం కచ్చితంగా నిర్మూలించాలి” అని ఆయన చేసిన దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గీతానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం గురించి ప్ర‌స్తావించారు.

34
TVKపై బీజేపీ తీవ్ర విమర్శలు

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయ‌కులు శాంతి కుమార్ తీవ్రంగా స్పందించారు. “అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పిన TVK అసలు రూపం బయటపడింది. కాంగ్రెస్ పార్టీలా వీరి వైఖరి కూడా స్పష్టమవుతోంది” అని అన్నారు. అలాగే ఆయ‌న మాట్లాడుతూ.. “హిందూ ఓట్లు తీసుకుని ఇప్పుడు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదు. ఉదయనిధి, ముస్తఫా ఇద్దరూ ఒకే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం మౌనం పాటిస్తున్నారు” అని విమర్శించారు.

44
తమిళనాడు రాజకీయాల్లో సనాతన అంశం హాట్ టాపిక్

తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు, సనాతన ధర్మంపై విమర్శలు కొత్త విషయం కాదు. పెరియార్ భావజాలాన్ని అనుసరించే పార్టీలు సామాజిక సమానత్వం పేరుతో సనాతన వ్యవస్థను విమర్శిస్తూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ వ్యాఖ్యలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిని విశ్వాసాలపై దాడిగా చూస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories