Aadhav Arjuna : పేదరికంలో పుట్టి, బిలియనీర్ ను పెళ్లాడి, విజయ్ కేబినెట్ లో చేరి..: యువ మంత్రి సక్సెస్ స్టోరీ

Published : May 14, 2026, 04:37 PM IST

Aadhav Arjuna : తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది… విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ తర్వాత ఎక్కువగా ఆకట్టుకున్నది మంత్రిగా అధవ్ అర్జున. ఇంతకూ ఎవరీయన..? 

PREV
15
ఎవరీ అథవ్ అర్జున..?

Aadhav Arjuna : ఎన్నో దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలకు పెట్టని కోటగా నిలిచింది తమిళనాడు. కానీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అతి తక్కువ సమయంలోనే ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టి అధికారాన్ని చేపట్టారు... ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లైంది. అందుకే ఈ చారిత్రక వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి తమిళనాడుకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

25
ముందు వరుసలో త్రిష..

తమిళనాడు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్ త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ పక్కన ఆమె కూర్చోవడం అక్కడున్న వారిలో చర్చనీయాంశమైంది. మీడియా కెమెరాలన్నీ ఆమె వైపే మళ్లాయి.

ప్రమాణ స్వీకార వేడుకకు త్రిష హాజరుకావడంతో గత కొన్ని వారాలుగా వినిపిస్తున్న ఊహాగానాలు మరింత వేడెక్కాయి. విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది. విజయ్ కుటుంబ సభ్యుల పక్కనే ఆమెకు స్థానం కల్పించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.

35
ఆ రోజు మరో మహిళ కూడా హాట్ టాపిక్..

అయితే ఆ రోజు వార్తల్లో నిలిచింది త్రిష ఒక్కరే కాదు. ప్రముఖ వ్యాపారవేత్త, ఆరీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ డైసీ మార్టిన్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె భర్త ఆధవ్ అర్జునా మంత్రి పదవీ స్వీకారం చేస్తుండగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని కన్నీటి తడితో చప్పట్లు కొడుతూ కనిపించారు.

డైసీ మార్టిన్ తమిళనాడులో ప్రభావశీల వ్యాపార కుటుంబంగా పేరొందిన మార్టిన్ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ముగ్గురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆమె తల్లి లిమా రోజ్ మార్టిన్ ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో అత్యంత ధనిక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.

45
బాస్కెట్‌బాల్ కోర్టు నుంచి మంత్రివర్గం వరకు...

ఆధవ్ అర్జునా జీవిత ప్రయాణం సినిమా కథలా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఒకప్పుడు ప్రతిభావంతమైన బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు. ధనిక కుటుంబానికి చెందిన డైసీని వివాహం చేసుకున్నప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో “నా లాంటి వ్యక్తి ధనిక కుటుంబం అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా?” అని ఆయన ప్రశ్నించడం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ తర్వాత అత్యంత సంపన్నుడిగా గుర్తింపుపొందాడు.

విజయాల వెనుక కుటుంబ వివాదం

అయితే ఈ విజయగాథ వెనుక వివాదాలూ ఉన్నాయి. డైసీ సోదరుడు జోసెఫ్ చార్లెస్ మార్టిన్, ఆధవ్ అర్జునాపై బహిరంగ ఆరోపణలు చేశారు. పలువురు మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, వారికి రోల్స్ రాయిస్ కార్లు బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల నుంచే వచ్చిన ఈ ఆరోపణలు సంబరాల నడుమ మరో చర్చకు దారి తీశాయి.

55
ఒక వేడుక... ఎన్నో కథలు

ఒకే ప్రమాణ స్వీకార వేడుకలో ఎన్నో కథలు కనిపించాయి. సినీ సూపర్ స్టార్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్... రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంలో త్రిష... భర్త విజయంతో కన్నీరు పెట్టుకున్న కోటీశ్వరురాలు డైసీ... పేదరికం నుంచి మంత్రి స్థాయికి చేరుకున్న ఆధవ్ అర్జునా... కుటుంబ వివాదాలతో మరో మలుపు తిరిగిన కథ. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది... కానీ ఇది నిశ్శబ్దంగా సాగేదిగా మాత్రం కనిపించడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories