Traffic Challan: మీ బండిపై ట్రాఫిక్ చ‌లాన్లు ఉన్నాయా.? లైసెన్స్ క్యాన్సిల్ కావడం ఖాయం

Published : Oct 06, 2025, 01:38 PM IST

Traffic Challan: కేంద్ర రవాణాశాఖ తాజా ముసాయిదా నిబంధనలు ట్రాఫిక్‌ చలాన్ల విషయంలో విధానాన్ని మ‌రింత క‌ఠిన‌తరం చేయ‌నుంది. చ‌లాన్ల ప‌రిమితి విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ట్రాఫిక్ చ‌లాన్లకు సంబంధించిన కొత్త నియ‌మాలు

హెల్మెట్ ధ‌రించ‌క‌పోయినా, సిగ్న‌ల్ జంప్ అయినా ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఆటోమెటిక్‌గా చ‌లాన్ పంపిస్తుంటారు. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే కొంత మంది వెంట‌నే చ‌లాన్ల‌ను చెల్లిస్తే మ‌రికొంద‌రు మాత్రం వాటిని లైట్ తీసుకుంటారు. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్‌కి ప‌ట్టుబ‌డితే అక్క‌డిక్క‌డే ట్రాఫిక్ చ‌లాన్ల‌ను క‌ట్టిస్తారు. అయితే ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెరుగుతోన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిష్కారం దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంది.

25
కీల‌క మార్పులు

ప్ర‌స్తుతం చ‌లాన్ చెల్లింపు గ‌డువు 90 రోజులు ఉంది అయితే దీనిని 45 రోజుల‌కు త‌గ్గించారు. ఒకే వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులకు ఆ వాహనానికి సంబధించిన డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేసే అధికారం లభిస్తుంది. ఒక‌వేళ చలాన్లు చెల్లించ‌క‌పోతే పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. చ‌లాన్లు పెండింగ్ కార‌ణంగా ఆ వాహనంపై అన్ని రకాల లావాదేవీలను (మార్కెట్‌కు అమ్మడం, కొనుగోలు, పేరు/చిరునామా మార్పులు, రెన్యువల్ వంటివి) నిలిపివేస్తారు.

35
చ‌లాన్ ప్ర‌క్రియ

ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఆధారంగా చలాన్ల జారీ, పేమెంట్, అప్పీల్ సాధనాలను వేగవంతంగా చేస్తారు. చలాన్ జారీపై సంబంధిత అధికారులు ఎలక్ట్రానిక్ రూపంలో 3 రోజుల్లో నోటీసు పంపాల్సి ఉంటుంది. ఫిజికల్ నోటీసు పంపేందుకు గ‌రిష్టంగా 15 రోజులు నిర్ణ‌యించారు. ఒక‌వేళ చ‌లాన్ చెల్లించ‌క‌పోతే వాహనాన్ని స్వాధీనం చేయడమే కాకుండా ఆ వాహనానికి సంబంధించిన అన్ని లావాదేవీలను నిలిపివేస్తారు.

45
చ‌లాన్ల‌కు బాధ్యులు ఎవ‌రు.?

ఇప్పటి వరకూ చలాన్లు ప్రధానంగా వాహన యజమాని పేరుతోనే జారీ అవుతున్నాయి. కానీ కొత్త విధానం ద్వారా డ్రైవర్‌ను నేరుగా బాధ్యుడిని చేసే వ్యవస్థ ప్రవేశ పెడతారు. వాహనం యజమాని ఆ సమయంలో వాహనం నడిపినవాడు కాదని తేలికగా నిరూపిస్తే, అసలు బాధ్యుడు డ్రైవరే అవుతారు. ఈ నిబంధనలకు సంబంధించి ఎవ‌రికైనా అభ్యంత‌రాలు ఉంటే స్వీక‌రిస్తున్నారు. అభ్యంతరాలను రహదారి రవాణా మంత్రిత్వశాఖ, అదనపు కార్యదర్శికి పంపవచ్చని అధికారులు తెలిపారు. అభ్యంత‌ర‌ల‌ను comments-morth@gov.in అనే ఈ-మెయిల్‌ ద్వారా అందజేయవచ్చు.

55
తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

మీ వాహ‌నంపై చ‌లాన్ ప‌డ‌గానే 45 రోజులలోపు చెల్లించాలి. వాహనం అమ్మకాలు లేదా పేరు మార్పులు చేసే ముందు చలాన్లను పూర్తిగా చెల్లించండి. వాహ‌న చల‌న్ వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు ఉంటే ఇ-మెయిల్‌ కు మీ అభిప్రాయాల‌ను తెలియ‌జేయండి. అయితే ఈ మార్పులు ఇప్ప‌టికిప్పుడు అమ‌ల్లోకి రాలేవు. ప్రస్తుతం ఇవి డ్రాఫ్ట్‌ రూపంలోనే ఉన్నప్పటికీ, అమలులోకి వస్తే వాహనదారులపై ప్ర‌భావం ప‌డుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories