భారతదేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 స్కూల్స్ ఇవే.. ఎంతెంత ఫీజులో తెలుసా? అంబానీలది టాప్ 1 కాదు

Published : Oct 25, 2025, 05:29 PM IST

Most Expensive Schools : ప్రస్తుతం సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదివే స్కూళ్లలోనే ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి. అలాంటిది ధనవంతుల పిల్లల చదివే స్కూళ్లలో ఫీజులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు… ఇలా దేేశంలోనే ఖరీదైన స్కూళ్లు ఏవో తెలుసా? 

PREV
110
దేశంలోనే అత్యధిక వార్షిక ఫీజులు గల స్కూళ్లు ఇవే

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి కుటుంబం నిర్వహించే విద్యాసంస్థ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS). ఇది ముంబైలో ఉంది... ఇక్కడే అంబానీ మనవలు, మనవరాళ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీల పిల్లలు చదువుకుంటారు. కాబట్టి దేశంలో అత్యంత ఖరీదైన స్కూల్ ఇదేనని మనందరం భావిస్తుంటాం. కానీ దీనికంటే ఖరీదు అంటే అత్యధిక ఫీజులు కలిగిన స్కూలు మరోటి ఉందట. అంతేకాదు ధీరూభాయ్ అంబానీ స్కూల్ స్థాయిలో వార్షిక ఫీజులున్న విద్యాసంస్థలు కూడా భారతదేశంలో మరికొన్ని ఉన్నాయి. ఈ స్కూళ్లలో ఫీజులు ఎలా ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని చదివించాలంటే మినిమం కోటీశ్వరులై ఉండాలి.

210
1. వుడ్‌స్టాక్ స్కూల్, ముస్సోరి

దేశంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలో ఉంది...దీనిపేరు వుడ్‌స్టాక్ స్కూల్ (IB). ఇక్కడ ఒక్క చిన్నారిని చదివించాలంటే వార్షిక ఫీజు సుమారు 16 లక్షల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

310
2. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై

అంబానీ యాజమాన్యంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఖరీదైన పాఠశాలల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ముంబైలోని ఈ ICSE, IGCSE, IB పాఠశాల వార్షిక ఫీజు 9 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

410
3. ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్, ముంబై

ఆర్థిక రాజధాని ముంబైలోని ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్ ఖరీదైన విద్యాసంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇది IB (PYP, MYP, DP) సిలబస్‌ను కలిగి ఉంది. ఇక్కడ వార్షిక ఫీజు సుమారు 9 నుంచి 11 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

510
4. ది డూన్ స్కూల్, డెహ్రాడూన్‌

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్ IB, IGCSE, ISC సిలబస్‌ను అందిస్తుంది. ఈ స్కూల్ చాలా ఖరీదైనది. ఇక్కడ భారతీయ విద్యార్థులకు సంవత్సరానికి రూ.11.95 లక్షలు, విదేశీ విద్యార్థులకు రూ.14.93 లక్షల ఫీజు ఉంటుంది.

610
6. ది బ్రిటీష్ స్కూల్, డిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలోని ది బ్రిటిష్ స్కూల్ ప్రజాదరణ పొందినదే కాదు ఖరీదైనది కూడా. ఇక్కడ IB, IGCSE సిలబస్‌తో విద్యాబ్యాసం అందిస్తారు. ఈ పాఠశాల ఫీజు 10 నుంచి 12 లక్షల రూపాయలు ఉంటుంది.

710
7. పాత్‌వేస్ వరల్డ్ స్కూల్, గురుగ్రామ్

దేశ రాజధాని డిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో పాత్‌వేస్ వరల్డ్ స్కూల్ IB (PYP, MYP, DP) సిలబస్‌ను కలిగి ఉంది. ఇక్కడ వార్షిక ఫీజు 6.45 - 13.85 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

810
8. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్

హైదరాబాద్ లో అయితే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అత్యంత ఖరీదైనది. ఇక్కడ IB, IGCSE, CBSE సిలబస్ అందుబాటులో ఉంది. వార్షిక ఫీజు 3.14 నుండి 7.95 లక్షల రూపాయలు ఉంటుంది.

910
9. గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఊటీ

తమిళనాడు రాష్ట్రం ఊటీలో ఉన్న గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఖరీదైనదే. ఇది IB, IGCSE, CBSE సిలబస్‌ను అందిస్తుంది. ఇక్కడ సంవత్సరానికి ఫీజు సుమారు 6 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుంది.

1010
10. వెల్హామ్ గర్ల్స్ స్కూల్, డెహ్రాడూన్

డెహ్రాడూన్‌లోనే మరో ప్రసిద్ధ, ఖరీదైన పాఠశాల వెల్హామ్ గర్ల్స్ స్కూల్. విద్యార్థులకు ICSE, ISC సిలబస్‌తో విద్యాబోధన అందించే ఈ పాఠశాలలో సంవత్సరానికి 7 నుంచి 9 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు.

గమనిక : పైన పేర్కొన్న స్కూళ్లలో ఫీజుల వివరాలు వివిధ మార్గాల్లో అందిన సమాచారంతో అందిస్తున్నాం. కాబట్టి ఫీజుల వివరాలు కాస్త అటుఇటుగా ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories