భార‌త సైన్యంలోకి ‘భైర‌వులు’.. వీరితో మాములుగా ఉండ‌దు. ఇక‌పై వారి ఆట‌లు సాగ‌వు

Published : Oct 23, 2025, 07:20 AM IST

Bhairav Battalion: ఇండియ‌న్ ఆర్మీ బ‌లోపేతానికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా భైర‌వ్ బ‌టాలియ‌న్ల పేరుతో భార‌త ఆర్మీలోకి కొత్త శ‌క్తి ఎంట‌ర్ అవుతోంది. ఇంత‌కీ ఏంటీ భైర‌వ్ బ‌టాలియ‌న్లు అనేగా.. 

PREV
15
భైరవ్ బటాలియన్లు అంటే ఏంటి?

భైరవ్ బటాలియన్లు అనేవి సైన్యంలో కొత్తగా ఏర్పాటైన తేలికపాటి కమాండో బలగాలు. ఒక్క యూనిట్‌లో సుమారు 250 మంది సైనికులు ఉంటారు. ఇవి సాధారణ ఇన్ఫంట్రీ కంటే చిన్నవి, కానీ స్పెషల్ ఫోర్స్‌ల కంటే కొంచెం పెద్దవి. వేగంగా స్పందించటం, ఆకస్మిక దాడులు చేయటం, టెక్నాలజీని ఉపయోగించి శత్రువును అణచివేయటం ఈ బలగాల లక్ష్యంగా చెప్పొచ్చు.

25
ఎన్ని బటాలియన్లు ఏర్పడ్డాయి?

భారత సైన్యం ఇప్పటికే 5 భైరవ్ బటాలియన్లను శిక్షణలోకి తీసుకువచ్చింది. ఇంకా 20 బటాలియన్లు వచ్చే ఆరు నెలల్లో సిద్ధం అవుతాయి. మొదటి బ్యాచ్ శిక్షణ అక్టోబర్ 1న ప్రారంభమై అక్టోబర్ 30తో పూర్తవుతుంది. తర్వాత అవి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడతాయి.

35
ఈ బలగాల ప్రత్యేకత ఏంటి?

ఈ బలగాలు కొత్త రకం తేలికపాటి ఆయుధాలు, డ్రోన్లు, సర్వేలెన్స్ పరికరాలతో సిద్ధంగా ఉంటాయి. వీటివల్ల క్లిష్టమైన పర్వతాలు, అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో కూడా వీరు స్వతంత్రంగా పనిచేయగలరు. అలాగే వీరికి గగనతల రక్షణ కోసం యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లు, ఖచ్చితమైన లక్ష్యాలను చేదించగల ఆర్టిలరీ సపోర్ట్‌ కూడా ఉంటుంది.

45
శిక్షణ ఎలా ఉంటుంది?

ప్రతి యూనిట్‌లో 7–8 మంది అధికారులు, 250 మంది సైనికులు ఉంటారు. మొదట 2–3 నెలలు రీజిమెంటల్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్‌లతో కలిసి ఒక నెల అధిక శిక్షణ ఇస్తారు. శత్రు కదలికల గమనిక, ఆకస్మిక దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, తక్షణ స్పందన అవసరమైన పరిస్థితుల్లో సహాయం చేయటం వంటి వీరి శిక్ష‌ణ‌లో ఉంటాయి.

55
వీటి ఉప‌యోగం ఏంటి.?

ఈ భైరవ్ బటాలియన్లు సాధారణ ఇన్ఫంట్రీ బలగాలు, స్పెషల్ ఫోర్స్‌ల మధ్య ఉన్న ఖాళీని భ‌ర్తీ చేస్తాయి. వీటివల్ల సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ దిశగా త్వరగా ప్రతిస్పందించగల సామర్థ్యం పెరుగుతుంది. సైన్యంలో జరుగుతున్న “డెకేడ్‌ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్” (దశాబ్ద మార్పు) ప్రణాళికలో భాగంగా వీటిని రూపొందించారు. ఇవే కాకుండా “రుద్రా బ్రిగేడ్”, “శక్తిబాణ్”, “దివ్యాస్త్ర” వంటి కొత్త యూనిట్లు కూడా సైన్యంలో తయారవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories