Heavy Rains : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పిడుగుల ప్రమాదం ఉండటంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరదప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కాగా, భద్రాచలం, కూనవరం, పోలవరం వద్ద నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.