I Love Muhammad: యావ‌త్ దేశాన్ని ఊపేస్తున్న ఒక చిన్న ఫ్లెక్సీ వివాదం.. అస‌లేంటీ ‘ఐ లవ్ ముహమ్మద్’

Published : Sep 23, 2025, 12:10 PM IST

I Love Muhammad: ఒక చిన్న ఫ్లెక్సీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా వివాదంగా మారింది. కాన్పూర్‌లో కొంత‌మంది ముస్లింలు ప్ర‌ద‌ర్శించిన బ్యాన‌ర్ దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లను హోరెత్తుతున్నాయి. ఇంత‌కీ ఏంటా ఫ్లెక్సీ.? అస‌లేం జ‌రిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
కాన్పూర్‌లో మొద‌లైన వివాదం

సెప్టెంబర్ 4న ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ రవట్పూర్‌లో జరిగిన బరావఫాత్ (ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ) శోభాయాత్రలో కొంద‌రు “I Love Muhammad” అని రాసిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ “కొత్త సంప్రదాయం మొదలుపెట్టారు” అని ఆరోపించాయి. పోలీసులు జోక్యం చేసుకొని పాత టెంట్, పోస్టర్లు తిరిగి పెట్టారు. బ్యానర్‌పై ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ లేకపోయినా, పాత టెంట్ తొలగించి కొత్తది పెట్టడం వల్ల సామాజిక విభేదాలు రేపినట్లు 24 మందిపై కేసులు నమోదు చేశారు.

25
ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాప్తి

కాన్పూర్ తర్వాత ఉనావ్‌లో యువకులు బ్యానర్లు పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు. కొన్నిచోట్ల రాళ్లదాడులు జరిగాయి. 8 ఎఫ్ఐఆర్‌లు, 5 అరెస్టులు జరిగాయి. మహారాజ్‌గంజ్‌లో ఊరేగింపును పోలీసులు అడ్డుకుని, 64 మందిపై కేసులు నమోదు చేశారు. వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కౌశాంబీలో కొంతమంది యువకులు తీవ్రవాద నినాదాలు చేసిన వీడియో వైరల్‌ కావడంతో ఉద్రిక్తత పెరిగింది. పోలీసులు డజన్ల కొద్దీ మందిని అదుపులోకి తీసుకున్నారు.

35
హైద‌రాబాద్‌లోనూ ఆందోళ‌న‌లు

లక్నోలో మహిళలు అసెంబ్లీ వద్ద శాంతియుత నిరసన చేపట్టి “I Love Muhammad” నినాదాలు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ సుమయా రానా “ఇది రాజ్యాంగ హక్కు, కేసులు పెట్టడం తప్పు” అన్నారు. హైదరాబాద్, నాగ్‌పూర్‌లో కూడా ప్రదర్శనలు జరిగాయి. నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ మైనారిటీ విభాగం నేతృత్వంలో మతపరమైన గుంపులు, రాజకీయ నేతలు ర్యాలీ చేశారు.

45
ఉత్తరాఖండ్‌లో ఘర్షణలు

ఉత్తరాఖండ్‌ కాశీపూర్‌లో అనుమతి లేకుండా ఊరేగింపు జరగడంతో పోలీసులతో ఘర్షణలు, రాళ్లదాడులు జరిగాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే పోలీసుల తక్షణ చర్యతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

55
ఎవ‌రెలా స్పందించారంటే.?

సమాజ్‌వాదీ పార్టీ: “ఐ లవ్ రామ్ అయినా, ఐ లవ్ ముహమ్మద్ అయినా చెప్పుకోవడం స్వేచ్ఛే” అని అన్నారు.

బీజేపీ: “చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించింది.

మతపెద్దలు: జమాత్‌ రజా-ఏ-ముస్తఫా, వరల్డ్‌ సూఫీ ఫోరమ్‌ హింసను ఖండించి, సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

ఓవైసీ (AIMIM): “ఐ లవ్ ముహమ్మద్ అనడం నేరం కాదు. ఇది మత స్వేచ్ఛ” అంటూ కాన్పూర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories