Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

Published : Sep 17, 2025, 06:14 PM ISTUpdated : Sep 17, 2025, 07:00 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

PREV
16
ప్రపంచంలో టాప్ ఏంబిఏ కాలేజీల్లో హైదరాబాద్

ప్రస్తుతం ఎంబిఏ (Master of Business Administration) కోర్సు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ కలిగిన కోర్సుగా ఉంది. లింక్డిన్ ప్రత్యేక సర్వే ప్రకారం, 2010 నుంచి ఇప్పటివరకు ఎంబిఏ పట్టభద్రులు అంతర్జాతీయ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడమే కాకుండా, వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతున్నారు. కెరీర్ గ్రోత్ 32 శాతం నుండి 87 శాతానికి పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది.

ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలో టాప్ బిజినెస్ స్కూల్స్‌కు ర్యాంకులు కేటాయించగా, ఇండియా-తెలంగాణలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హైదరాబాద్ టాప్ 5లో చోటు సంపాదించింది. 

టాప్ 10 ఎంబిఏ కాలేజీలు

1. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్

2. హార్వార్డ్ బిజినెస్ స్కూల్

3. INSEAD బిజినెస్ స్కూల్

4. ది వార్టన్ స్కూల్

5. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్

6. కెల్లొగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్

7. MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్

8. టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్

9. కొలంబియా బిజినెస్ స్కూల్

10. లండన్ బిజినెస్ స్కూల్

26
అమరావతి రైతులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంలో భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు పెద్ద ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను ఇకపై “అసైన్డ్” పేరుతో కాకుండా పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 

అసైన్డ్ ట్యాగ్ కారణంగా వాటిని విక్రయించలేకపోతున్నారని రైతులు ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన మార్పులు చేస్తూ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

36
ప్రధాని మోదీ బర్త్ డే.. ట్రంప్ తో మళ్లీ చర్చలు.. టారిఫ్ లు తగ్గేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా ప్రపంచ నాయకుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫోన్ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇప్పుడే నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మంచి సంభాషణ జరిగింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. మోదీ గొప్ప పని చేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశలో మద్దతు అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ట్రంప్ మాటలతో మోదీపై మరోసారి ప్రశంసలు కురిశాయి.

కాాగా, ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడిన తర్వాత మరోసారి భారత్-అమెరికా సంబంధాలపై చర్చ నడుస్తోంది. టారిఫ్ అంశం త్వరలోనే మళ్లీ చర్చకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

46
మళ్లీ అగ్నిగుండంలా మారిన గాజా సిటీ

ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా సిటీ మళ్లీ అగ్నిగుండంలా మారింది. లక్షలాది మంది నివసించే ఈ నగరంపై ఇజ్రాయెల్‌ దళాలు దాడులు చేస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువ మంది గాజా సిటీకి చెందినవారే. ఇప్పటికే లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి దక్షిణ తీర ప్రాంతాలవైపు తరలిపోయారు. ఐరాస జాతి విధ్వంసంపై హెచ్చరిక జారీ చేసిన రోజునే ఇజ్రాయెల్‌ సైన్యం ఆపరేషన్లు వేగవంతం చేయడం గమనార్హం.

గాజాలో సుమారు 3,000 హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని భావించిన ఇజ్రాయెల్‌ వారిని సమూలంగా అంతమొందించడమే లక్ష్యమని తెలిపింది. ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు దాడులు ఆగవు’’ అని విదేశాంగ మంత్రి కట్జ్‌ ప్రకటించారు.

56
పాకిస్తాన్ కు చావోరేవో.. భారత్ తో మరో మ్యాచ్ ఉంటుందా?

ఆసియా కప్‌ టీ20లో భారత్‌ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొన్న పాక్‌ ఇప్పుడు యూఏఈతో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సూపర్‌-4లో స్థానం లభిస్తుంది. భారత్‌ ఇప్పటికే 2 విజయాలతో మెరుగైన రన్ రేటుతో సూపర్ ఫోర్ చేరుకుంది. 

ఒమన్‌ రెండు ఓటములతో టోర్నీ నుంచి అవుట్ అయింది. పాకిస్తాన్, యూఏఈ ఒక్కో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నాయి. భారత్ చేతిలో ఓటమి తర్వాత పాక్  నిరాశలో కనిపిస్తోంది. అలాగే, ఈ మ్యాచ్ తర్వాత వచ్చిన వివాదాలు జట్టు ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశముంది. యూఏఈ పై గెలిస్తే సూపర్ 4 కు పాక్ చేరుకుంటుంది. ఇదే జరిగితే భారత్, పాక్ మరోసారి తపడే అవకాశం ఉంటుంది.

66
సెప్టెంబర్ 17: తెలంగాణ విలీనం, విమోచణం, సమైక్యత

సెప్టెంబర్ 17న తెలంగాణ విలీనం, విమోచణ, సమైక్యత దినోత్సవాలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ విమోచణ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ సమావేశాలు నిర్వహించింది. విలీనం పేరుతో కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టగా, బీఆర్‌ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా గుర్తించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. లెఫ్ట్ పార్టీలు ప్రజా ఉద్యమం ఫలితంగా రాష్ట్రం స్వేచ్ఛ సాధించిందని స్పష్టం చేస్తున్నాయి.

కాగా, 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య "పోలో ఆపరేషన్‌" ద్వారా హైదరాబాద్‌ నిజాం పాలన ముగిసింది. తెలంగాణ భారత్‌లో విలీనం అయింది. దీనిని కొందరు విమోచణ దినంగా, మరికొందరు విలీనం దినంగా పిలుస్తూ రాజకీయంగా వేర్వేరు కోణాల్లో ఆచరిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories