Modi Birthday: నరేంద్ర మోదీ బుధవారం 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నవభారత నిర్మాణమే తన లక్ష్యమని చెప్పే మోదీ గారు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న వాద్ నగర్ (అప్పట్లో బాంబే స్టేట్, ప్రస్తుతం గుజరాత్‌లో) జన్మించారు. ఆయన కుటుంబం చాలా సాధారణ స్థితిలో ఉండేది. తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ ఒక టీ దుకాణం నడిపేవారు. చిన్ననాటి నుంచి నరేంద్ర మోదీ కూడా ఆ దుకాణంలో సహాయం చేసేవారు. ఆరుగురు పిల్లల్లో ఆయన మూడో సంతానం. సాధారణ కుటుంబంలో పెరిగిన ఈ అనుభవం ఆయనలో కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని, సూటిగా మాట్లాడే శైలిని, సాధారణ ప్రజలతో కలిసిపోయే స్వభావాన్ని పెంచింది.
25
మొసలిని ఇంటికి తీసుకొచ్చిన మోదీ
నరేంద్ర మోదీ చిన్ననాటి నుంచే ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన కూడా చాలా సార్లు స్వయంగా తెలిపారు. 2019లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మోదీ పంచుకున్న తన చిన్ననాటి జ్ఞాపకం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పుడు ఒకసారి కొలనులో ఈత కొడుతూ ఉండగా, అక్కడ ఒక చిన్న మొసలిని గమనించారు. ఆ జంతువును పట్టుకుని ఇంటికి తీసుకువెళ్లారు. కానీ, తల్లి చూసి గట్టిగా మందలించడంతో, వెంటనే తిరిగి ఆ మొసలిని కొలనులో వదిలిపెట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. మోదీ చిన్ననాటి అనుభవం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తమిళనాడులోని ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, మొదటి తరగతి పిల్లల కోసం ఆయన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను పాఠంలో చేర్చింది.
35
మోదీకి ఇష్టమైన ఆహారం ఏంటి.?
ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా శాఖాహారాన్ని తీసుకుంటారు. తక్కువ మోతాదులోనే తన భోజనం ఉండేలా చూసుకుంటారు. 75 ఏళ్లలోనూ ఇంత యాక్టివ్‌గా ఉండడానికి తన ఫుడ్ స్టైల్ కారణమని చెబుతుంటారు. ఇక మోదీకి ఫూల్ మఖానా, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, మునగాకు పరాటా, కిచిడీ, శ్రీఖండ్, డోక్లా, లిట్టి చొఖానిని ఎంతో ఇష్టంగా తింటారు. ఆహారాన్ని రోజూ ఒకే మోతాదులో తీసుకోవడం మోదీ అలవాటు.
రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా ప్రధాని కొన్ని ఇష్టాలను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల వయసు నుంచే మోదీకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కెమెరా పట్టుకుని వెళ్లేవారు. ఇప్పటికీ పలు జాతీయ పార్కుల్లో మోదీ కెమెరాతో దర్శనమిచ్చిన ఫొటోలు కనిపిస్తుంటాయి. ఇక మోదీకి కవిత్వంపై కూడా చాలా ఆసక్తి. ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలు చదవడం, కవితలు రాస్తుంటారు.
55
వీధి నాటకాలు కూడా
మోదీ గురించి చాలా మందికి తెలియని విషయాల్లో ఇదీ ఒకటి. నరేంద్ర మోదీ చిన్నతనంలో వీధి నాటకాలు కూడా వేసేవారు. చదువు, ఆటలతో పాటు స్టేజీ నాటకాలు అంటే కూడా మోదీకి ఇష్టం. అయితే నాటకాల ద్వారా వచ్చే డబ్బును కూడా సమాజానికే ఉపయోగించే వారు మోదీ. నాటకం వేయంగా వచ్చిన డబ్బుతో దెబ్బతిన్న స్కూల్ గోడను బాగు చేయించారు.