NIA: పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించిన‌ తెలుగు యూట్యూబ‌ర్‌.. అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు

Published : May 29, 2025, 07:01 PM ISTUpdated : May 29, 2025, 07:02 PM IST

ప‌హ‌ల్గామ్ దాడుల త‌ర్వాత భార‌త్‌లో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మ‌న దేశంలో ఉంటూ పాకిస్థాన్‌కు స‌హాయం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఇప్ప‌టికే అధికారులు ప‌లువురిని అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. 

PREV
15
చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి

బైక్‌పై తిరుగుతూ వ్లాగ్స్ చేసే ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్ భ‌య్యా స‌న్నీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బైక్‌పై విదేశాల‌కు కూడా వెళ్లే స‌న్నీ ఇటీవ‌ల పాకిస్థాన్ కూడా వెళ్లారు. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన అతడిని చెన్నై ఎయిర్‌పోర్టులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

25
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై కేసు నమోదు

బెట్టింగ్ యాప్‌లను ప్ర‌మోట్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు మార్చి 22వ తేదీన‌ సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే విదేశాల్లో ఉన్న అతనిపై అధికారులు అన్ని ఎయిర్‌పోర్టుల్లో లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.

35
పాకిస్తాన్‌ టూర్ వీడియోలు..

కాగా గత కొన్ని నెలలుగా సన్నీ యాదవ్ పాకిస్తాన్‌లో గడిపాడు. అక్కడి నుంచి తన బైక్ రైడ్‌లతో పాటు పర్యటన వీడియోలను తన యూట్యూబ్‌, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్న వారిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు

45
ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు

సన్నీ యాదవ్ పాకిస్తాన్ వీడియోలపై ఓ నెటిజన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, చెన్నై పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ అధికారులు ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, అతడిని నేరుగా ఢిల్లీకి తరలించి ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

55
అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అయితే స‌న్నీ అరెస్టుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. స‌న్నీ పాకిస్థాన్ ఎలా వెళ్లాడు.? అక్క‌డ ఏం చేశాడ‌న్న కోణంలో విచార‌న జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల మ‌హిళ యూట్యూబ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌న్నీ విష‌యంలో కూడా అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories