DIGIPIN : మీకు ఆధార్ కార్డులాగే మీ ఇంటికి డిజిపిన్ .. ఎలా పొందాలి? దీనివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Published : May 29, 2025, 12:58 PM ISTUpdated : May 29, 2025, 01:39 PM IST

మీకు ఆధార్ కార్డ్ ఎలాగో మీ ఇంటికి డిజిపిన్ అలాగే. కేంద్ర ప్రభుత్వం దీన్ని అందిస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు వెంటనే తీసుకోవాలనుకుంటారు. ఈ డిజిపిన్ ప్రయోజనాలేంటి? ఎలా పొందాలి? ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
మీ ఇంటి ఆధార్ కార్డే ఈ డిజిపిన్

ప్రస్తుతం చిన్నపిల్లల నుండి పండుముసలి వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. ప్రభుత్వం పథకాలు, బ్యాంక్ అకౌంట్ ఇలా అదీఇదని లేదు ప్రతిదానికి ఆధార్ నెంబర్ ను లింక్ చేస్తున్నారు.. అంటే ఆధార్ కార్డ్ లేకుంటే బ్రతకడం కష్టమేమో అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇలా దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్లే ప్రతి ఇంటికీ డిజిటల్ ఐడీ కేటాయించాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసమే 'నో యువర్ డిజిపిన్', 'నో యువర్ పిన్ కోడ్' అనే రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లను కేంద్రం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ఆధారిత సేవలను మరింత సులభతరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

25
డిజిపిన్ అంటే ఏమిటీ?

డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ నే డిజిపిన్ అంటారు . ఇది జియో కోడ్ ఆధారిత, గ్రిడ్ ఆధారిత డిజిటల్ అడ్రస్ వ్యవస్థ. ప్రతి ఇంటికీ, భవనానికీ ఒక ప్రత్యేక డిజిపిన్ ఉంటుంది. దీని ద్వారా ఖచ్చితమైన చిరునామా తెలుసుకోవచ్చు. కేంద్ర పోస్టల్ శాఖ, పిఎంఓ ఈ డిజిటల్ అడ్రస్ ప్రూఫ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐఐటి హైదరాబాద్, ఎన్ఆర్ఎస్సి, ఇస్రో సాయంతో దీన్ని డెవలప్ చేసారు.

35
ఎలా పనిచేస్తుంది?

'నో యువర్ డిజిపిన్' పోర్టల్ ద్వారా ప్రజలు తమ జియోలొకేషన్, అక్షాంశ-రేఖాంశ ఆధారంగా 10 అంకెల డిజిపిన్ పొందవచ్చు. ఆధార్ లాగానే ఇది ప్రతి ఇంటికీ, భవనానికీ ఉంటుంది. ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకోవడానికి, సరుకులు, కొరియర్, అత్యవసర సేవలు సకాలంలో అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.

45
డిజిపిన్ ఉపయోగాలేంటి?

ఆన్‌లైన్ షాపింగ్, కొరియర్, ఫుడ్ డెలివరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితమైన చిరునామా చాలా ముఖ్యం. చాలా మంది చిరునామాలు సరిగ్గా లేకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది. దీనివల్ల జీడీపీపై ప్రభావం పడుతోంది. దీన్ని అధిగమించడానికి డిజిపిన్ వ్యవస్థను తీసుకొచ్చారు.

ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేర్చేందుకు ఈ డిజిపిన్ ఉపయోగపడుతుంది. అవినీతి లేకుండా ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలు అందించవచ్చు. ఈ డిజిపిన్ పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది... త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

55
పిన్ కోడ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమయ్యింది?

ప్రస్తుతం ఉన్న 6 అంకెల పిన్ కోడ్ వ్యవస్థను 1972లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే 'నో యువర్ పిన్ కోడ్' పోర్టల్ ద్వారా జీపీఎస్ సాయంతో ఖచ్చితమైన పిన్ కోడ్ తెలుసుకోవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories