Published : May 29, 2025, 06:15 PM ISTUpdated : May 29, 2025, 06:49 PM IST
గోవాకు ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గోవాకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. అయితే గోవాలో పర్యాటకులకు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ప్రయాణం ఒకటి.
గోవా వెళ్లిన వారిలో ఎక్కువ మంది చెప్పేది అక్కడ ట్రాన్స్‌పోర్ట్ సరిగా ఉండదని. క్యాబులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తాయని అంటారు. అయితే ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను (గోవా ట్రాన్స్‌పోర్ట్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025) విడుదల చేసింది. దీంతో గోవాలోని క్యాబ్ మాఫియా దోపిడీ నుంచి పర్యాటకులకు ఉపశమనం లభిస్తుందని అంచనా.
25
విపరీతమైన ధరలు
గోవాకు వచ్చే పర్యాటకులు ఇప్పటికే ఉన్న టాక్సీల సమస్యల గురించి చాలా కాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో పర్యాటకులు తరచుగా స్థానిక టాక్సీలపై ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక క్యాబ్ ఆపరేటర్లకు మార్కెట్‌లో బలమైన పట్టు ఉంది. దీంతో గోవాలో క్యాబ్‌లో ప్రయాణించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. సింగిల్ ట్రిప్‌కి కూడా డబుల్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు.
35
మొదలైన వ్యతిరేకత
ఓవైపు ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు ఈ నిర్ణయాన్ని టాక్సీ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులు వస్తే తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని స్థానిక టాక్సీ ఆపరేటర్లు అంటున్నారు.
అయితే ఒకప్పుడు వేలాది మందితో కిటకిలాడిన గోవాలో ఇటీవల పరిస్థితి మారింది. పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో మళ్లీ పర్యాటకులను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా క్రమంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.
55
పెరుగుతోన్న పర్యాటకులు
2025 మొదటి త్రైమాసికంలో పర్యాటకుల రాక 10.5% పెరిగింది. 2025 జనవరిలో దాదాపు 28.5 లక్షల మంది పర్యాటకులు గోవాకు వచ్చారు. గత సంవత్సరం ఇదే సమయంలో ఇది 25.8 లక్షలు గోవాను సందర్శించారు.