గాలి పీల్చుకోలేం, నీరు తాగలేం.. 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే ఏంటి ఉపయోగం.?

Published : Nov 27, 2025, 11:20 AM IST

Sabeer Bhatia: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారింది. అయితే దేశ ప్ర‌జ‌ల రోజువారీ జీవితం మాత్రం ఇంకా క‌ఠినంగానే ఉంద‌ని అంటున్నారు హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా. 

PREV
14
భారత్ 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా..

భారత్ 2025లో 4.19 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ కోట్లు మంది ప్రజలకు రోజువారీ జీవితం మాత్రం ఇంకా కఠినంగానే ఉంది. గాలి కాలుష్యం, దుష్ట నీళ్లు, కల్తీ ఆహారం, అసమాన మౌలిక సదుపాయాలు వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అంటూ.. హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఈ పరిస్థితిపై ప‌లు ప్రశ్నలు లేవనెత్తారు.

24
“జనం గౌరవంగా జీవించలేకపోతే GDPకి అర్థమేంటి?”

భాటియా Xలో పోస్టు.. “గాలి శ్వాస తీసుకోలేరు. నీళ్లు తాగలేరు. ఆహారం కల్తీ అవుతోంది. మౌలిక వసతులు చెడిపోయాయి. ప్రజలు గౌరవంగా జీవించలేని దేశం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ప్రయోజనం ఏమిటి?” GDP పెరిగిందంటే జీవన నాణ్యత ఆటోమేటిగ్గా మెరుగవ్వదు అని చెప్పుకొచ్చారు. కేవలం GDP పెరుగుదలతో సమస్యలు పరిష్కారం కావు. భాటియా చెప్పిన విషయాలు ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. GDP ర్యాంక్ గాలి శుభ్రం చేయదు, నీటి నాణ్యత మెరుగుపరచదు, ఆహారంలో కల్తీ ఆపదు, రోడ్లు, సేవలు ఆటోమేటిగ్గా మెరుగవ్వవు అని అన్నారు. ఆర్థిక ప్రగతితో చూపించే సంఖ్యలు పెరిగినా, సామాన్య ప్రజల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

34
భారత్‌ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు

గాలి కాలుష్యం:

దేశ జనాభాలో 46% మంది సురక్షిత పరిమితి కంటే అధిక PM2.5 ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బైర్నిహాట్ న‌గ‌రంలో: 200 µg/m³ కంటే ఎక్కువ, ఢిల్లీ: 165 µg/m³ (2025 అక్టోబర్). ఇది ఆరోగ్యం, ఆయుష్షుపై నేరుగా ప్రభావం చూపుతోంది.

నీటి నాణ్యత:

కలుషిత నదులు: 2018లో 351 → 2025లో 296

రాజస్థాన్, హర్యాణా, ఆంధ్రప్రదేశ్‌లో గ్రౌండ్‌వాటర్‌లో ఫ్లోరైడ్, ఇతర రసాయనాలు అధికంగా ఉంది.

ఆహార కల్తీ:

FSSAI రిపోర్ట్: 33,000కుపైగా అసురక్షిత ఆహార నమూనాలు (2023–24). నోయిడాలో పన్నీర్ నమూనాల్లో 40% సుర‌క్షితంగా లేదు. పాలు, పండ్లు, మసాలాల్లో కూడా విస్తృత కల్తీ జ‌రుగుతోంది.

మౌలిక వసతులు:

పంజాబ్, హర్యాణా వంటి రాష్ట్రాలు బాగున్నా, కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.

భారత్‌మాల ప్రాజెక్ట్‌లో 19,000 కి.మీ రోడ్లు నిర్మించినా, అనేక పట్టణాల్లో ట్రాఫిక్, సేవల లోటు కొనసాగుతోంది.

44
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

భారత్‌ ఆర్థికంగా ఎదుగుతున్నా, ప్రజల ఆరోగ్యం, భద్రత, జీవిత నాణ్యతను మెరుగుపర్చే చర్యలు లేకపోతే ఆ పెరుగుదల అర్థం ఉండదని భాటియా స్పష్టంచేశారు. భాటియా వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని, సమాజాన్ని, పాలన వ్యవస్థను.. “ఆర్థిక వృద్ధితో పాటు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తాం?” అనే ప్ర‌శ్న‌ను సంధిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories