సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

First Published | Jan 12, 2024, 10:50 AM IST

మహారాష్ట్రలో పలు కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పాల్గొంటారు. దేశంలో సముద్రంపై అతి పొడవైన వంతెనను మోడీ ప్రారంభిస్తారు.
 

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

దేశంలో  సముద్రంపై అతి పొడవైన  అటల్ సేతు బ్రిడ్జిని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు.  ఈ బ్రిడ్జి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలకు కూడ  ప్రయాణించే  సమయం కూడ తక్కువ కానుంది.  దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ స్మారకార్ధం ఈ బ్రిడ్జికి అటల్ సేతుగా నామకరణం చేశారు. 

also read:అయోధ్య రామ మందిరం: 11 రోజుల క్రతువును ప్రారంభించనున్న మోడీ

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

ప్రధానంగా ముంబై నగరంలోని ముంబై  నుండి నవీ ముంబై మధ్య ప్రయాణించే  సాధారణ ప్రయాణీకుల కష్టాలు తీర్చనుంది. అటల్ సేతు బ్రిడ్జి   పొడవు 21.8 కి.మీ. ఆరు లేన్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.  ఇది సముద్రంలో  16.5 కి.మీ. భూమిపై 5.5 కి.మీ. పొడవు ఉంటుంది.  భారత దేశంలో సముద్రంపై  ఉన్న అత్యంత పొడవైన వంతెన ఇదే.

also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు


సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం కూడ గణనీయంగా తగ్గనుంది.ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉండడంతో  ఈ ప్రాంతం మధ్య ప్రయాణానికి  రెండు గంటల సమయం పడుతుంది.  అటల్ సేతుపై ప్రయాణం చేస్తే  20 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.  అంతేకాదు నిరంతరం ట్రాఫిక్ జామ్ ల నుండి ఉపశమనం కలగనుంది. ఈ వంతెనపై  100 కి.మీ. వేగంతో  ప్రయాణం చేయవచ్చు.

also read:ఎస్‌బీఐ బ్యాంకులోకి ఎద్దు: ఏం చేసిందంటే...వీడియో వైరల్

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....


ఎంఎంఆర్‌డీఏ, జేఐసీఏ నిర్వహించిన అధ్యయనం మేరకు  ఎంటీహెచ్ఎల్ సెర్వీ, చిర్లే మధ్య ప్రయాణం 61 నిమిషాల నుండి  16 నిమిషాలకు తగ్గనుంది.ప్రతి రోజూ కనీసం 40 వేల వాహనాలు ఈ బ్రిడ్జిపై నుండి ప్రయాణించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

also read:వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు నిరాకరణ: పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బలప్రదర్శన

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

పుణె, అలిబాగ్, గోవా, పన్వేల్ లను కూడ కలిపేందుకు  ఈ బ్రిడ్జి దోహద పడుతుంది.  నవీ ముంబైలో ఉన్న అంతర్జాతీయ  విమానాశ్రయం, ముంబై పుణె ఎక్స్‌ప్రెస్ వే, ముంబై గోవా హైవే ల మధ్య ఈ బ్రిడ్జి కనెక్టివిటిని గణనీయంగా మెరుగుపర్చనుంది.

also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

ముంబైని ప్రధాన భూభాగానికి కలిపే బే క్రాసింగ్ ఆలోచనను 1963లో  అమెరికన్ కన్‌స్ట్రక్షన్ కన్సల్టెన్సీ సంస్థ  విల్బర్ స్మిత్ అసోసియేట్స్ తొలిసారిగా రూపొందించింది.ఆ తర్వాత ఈ ప్రతిపాదనలో ఎలాంటి కదలిక రాలేదు. అయితే  1990లో  ఈ ప్రణాళిక  పునరుద్దరించబడింది.  2006లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

also read:జనంలోకి కేసీఆర్: జిల్లాల పర్యటనకు గులాబీ బాస్

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

2008 ఫిబ్రవరిలో అనిల్ అంబానీ  రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా  11 నెలల్లో  రూ. 6 వేల కోట్ల బ్రిడ్జి నిర్మాణానికి ముందుకు వచ్చింది. అయితే కొన్ని నెలల తర్వాత ఈ ప్రాజెక్టు నుండి అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ తప్పుకుంది.  ఆ తర్వాత  నోడల్ ఏజెన్సీని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుండి ముంబై  మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి మార్చారు.

also read:మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?
 

సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....

జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జేఐసీఏ)తో ఎంఎంఆర్‌డీఏ ఒప్పందం కుదుర్చుకుంది.  దీంతో ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి.  2017 డిసెంబర్ లో  టెండరింగ్ పూర్తైంది.  2018లో  ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి.  ఈ బ్రిడ్జి నిర్మాణానికి  రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ. 15, 100 జైకా నుండి రుణం తీసుకున్నారు. 

also read:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్

Latest Videos

click me!