అయోధ్యరాముడిని రామ్ లల్లా అని ఎందుకు పిలుస్తారు?

First Published | Jan 6, 2024, 11:33 AM IST

బాల రాముడిని వర్ణించే సమయంలో తులసీదాస్ రామ్ లల్లా లేదా  రామ్ లాలా అని పిలిచాడు. ఇప్పుడు అదే పేరును ప్రచారంలోకి తెచ్చారు.

అయోధ్యలో  రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతోంది. జనవరి22  కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22, 2024 ఉదయం 12:30 గంటలకు ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు. రామాలయ ప్రారంభోత్సవం అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్నాయి.


ముగ్గురు శిల్పులు బాలరాముడి  విగ్రహాలను వేరువేరుగా  తయారు చేశారు. వీటిల్లో కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ చేసిన బాల రాముడు విగ్రహం గర్భగుడిలో ప్రతిష్టించడానికి ఎంపికయింది. 

అయితే రాముడిని రామ్ లల్లా లేదా రామ్ లాలా అని ఎందుకు పిలుస్తారు అనేది ఇప్పుడు ఓ సందేహం. రామ్ లల్లా లేదా రామ్ లాలా అంటే  బాల రూపంలో ఉన్న రాముడు. 5-6 ఏళ్ల వయసులో ఉన్న బాల రాముడు.

బాల రాముడిని వర్ణించే సమయంలో తులసీదాస్ రామ్ లల్లా లేదా  రామ్ లాలా అని పిలిచాడు. ఇప్పుడు అదే పేరును ప్రచారంలోకి తెచ్చారు ఆలయ నిర్వాహకులు. 

తులసీదాస్ రచించిన రామ్ చరిత మానస్ అనే గ్రంథంలో బాలరాముడి సుందరమైన రూపం గురించిన వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఈ వర్ణనను దృష్టిలో ఉంచుకునే ఈ బాల రాముడి విగ్రహాలను తయారు చేశారు.

చిన్నపిల్లలను బుజ్జి, చిట్టి, కన్నా అని మనం ఎలా ముద్దుగా పిలుస్తామో.. అలాగే అయోధ్య, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో చిన్నపిల్లలను లల్లా అని పిలవడం పరిపాటి. ప్రేమతో కూడిన ఈ పిలుపునే బాల రాముడికి  పెట్టారు. 
 

Latest Videos

click me!