ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతీరాయికి శల్యపరీక్షలు.. ఐదు రకాల టెస్టులు తరువాతే...

First Published | Jan 5, 2024, 2:29 PM IST

రామాలయం నిర్మాణానికి వాడిన ప్రతీ ఒక్క రాయిని వేరు వేరు టెస్టులు చేశారు. అవన్నీ పాసైన తరువాతే వాటిని నిర్మాణానికి ఉపయోగించారు. 

అయోధ్య : రామాలయం ప్రారంభోత్సవం, గర్భగుడిలో విగ్రహప్రతిష్టాపన ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22కు ఇంకా ఎంతో దూరం లేదు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. 

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో తెలిస్తే.. ఆశ్చర్యరం కలగక మానదు. రామాలయానికి వాడిన ఒక్కోరాయీ ఐదు అంచెల పరీక్షలు పాసయ్యాకే.. నిర్మాణంలో వాడడానికి అర్హత సాధించింది.


రామాలయం నిర్మాణానికి వాడిన ప్రతీ ఒక్క రాయిని వేరు వేరు టెస్టులు చేశారు. అవన్నీ పాసైన తరువాతే వాటిని నిర్మాణానికి ఉపయోగించారు. 

కర్ణాటకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ టెస్టింగ్ లోని సైంటిస్టులు ఈ పరీక్షలు చేశారు. వారు ప్రతీరాయిని క్షుణ్ణంగా పరీక్షించి, ఆ తరువాత రాయి మీద ముద్ర వేస్తేనే రాయికి అర్హత లభించింది. 

నృపేంద్ర మిశ్రా చెప్పిన వివరాల ప్రకారం..రామమందిరానికి వాడిన రాళ్లు అనేక పరీక్షలు పాసయ్యాయట. నిర్మాణంలో వాడే రాళ్లను ఎన్ఐఆర్ఎం ల్యాబ్ కు తీసుకెళ్లి అక్కడ కఠిన పరీక్షలు నిర్వహించారు. అలా రాయి దృఢత్వాన్ని నిర్థారించారు. 

ఎన్ఐఆర్ఎం.. ఫీల్డ్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లతో పాటు బేసిక్ అండ్ అప్లాయిడ్ రీసెర్చ్, రాక్ ఇంజినీరింగ్ లోని కఠిన పరీక్షలన్నింటినీ నిర్వహిస్తుంది. వాటిమీద పరిశోధనలు చేస్తుంది. 

Latest Videos

click me!