PM Modi: శ్రీలంక, థాయ్‌లాండ్‌లో మోదీ పర్యటన.. ఎందుకో తెలుసా?

Published : Apr 03, 2025, 11:05 AM IST

ప్రధాని మోడీ థాయ్‌లాండ్, శ్రీలంకలో మూడు రోజుల పర్యటనకు బయలుదేరారు. బిమ్స్‌టెక్ సదస్సుతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ టూర్ రెండు దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. ఈ మోదీ పర్యటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
14
PM Modi:  శ్రీలంక, థాయ్‌లాండ్‌లో మోదీ పర్యటన.. ఎందుకో తెలుసా?
శ్రీలంక, థాయ్‌లాండ్‌లో ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటన

PM Modi Tour: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం థాయ్‌లాండ్, శ్రీలంకలో మూడు రోజుల టూర్‌కు బయలుదేరారు. తన టూర్‌లో బిమ్స్‌టెక్ సదస్సుతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఈ టూర్ ఈ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో ఉంటుందని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

24
6వ బిమ్స్‌టెక్ సదస్సు

బిమ్స్‌టెక్ సదస్సు:

పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాబోయే మూడు రోజుల్లో థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించి, ఆ దేశాలు, బిమ్స్‌టెక్ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని.. గురువారం సాయంత్రం బ్యాంకాక్‌లో ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాతో కలిసి ఇండియా-థాయ్‌లాండ్ స్నేహం గురించి చర్చిస్తానని తెలిపారు. అలాగే శుక్రవారం బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొంటానన్న మోదీ.. థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ను కూడా కలుస్తానని రాసుకొచ్చారు. 

34
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ప్రధాని మోడీ

శ్రీలంక టూర్:

మరో పోస్ట్‌లో తన శ్రీలంక టూర్ గురించి ప్రధాని మాట్లాడుతూ, అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా టూర్ తర్వాత తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు చెప్పారు.

44

ఇండియా-శ్రీలంక స్నేహం:

నా శ్రీలంక టూర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా పర్యటన తర్వాత ఈ టూర్ జరుగుతోంది. ఇండియా-శ్రీలంక స్నేహం గురించి మేం చర్చిస్తాం. ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం గురించి కూడా చర్చిస్తాం. శ్రీలంకలో జరిగే చర్చల కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానను అని ప్రధాని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.  

Read more Photos on
click me!

Recommended Stories