భారతదేశంలో పొందిన లైసెన్స్ సహాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశాల్లోనూ వాహనాలు నడపొచ్చు. అయితే ఇందులో కొన్ని నిబంధనలు ఉంటాయి. సహజంగా విదేశాల్లో వాహనాలు నడపాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ) అవసరం ఉంటుంది. ఈ పర్మిట్‌తో ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో వాహనాలను నడిపించవచ్చు. అయితే ఈ డ్రైవింగ్ పర్మిట్ లేకుండు కూడా 25 దేశాల్లో భారతీయ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. కానీ ఈ లైసెన్స్‌కి కేవలం కొన్ని రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది.
అమెరికా, యూకే వంటి దేశాల్లో భారతీయ లైసెన్స్ ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. అమెరికాలో లైసెన్స్ ఇంగ్లీషులో ఉండాలి, కానీ బ్రిటన్‌లో అలాంటి నిబంధన లేదు. అలాగే ఆస్ట్రేలియా, యుకె, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్‌లలో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఒక సంవత్సరం చెల్లుతుంది. మలేషియా, కెనడాలో భారతీయ లైసెన్స్ మూడు నెలలు చెల్లుతుంది. అదేవిధంగా జర్మనీ, స్పెయిన్‌లలో లైసెన్స్ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
IDP అవసరమయ్యే దేశాలు
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాల్సిన దేశాలు ఏంటంటే.
ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బ్రెజిల్, రష్యా దేశాల్లో వాహనాలను నడపాలంటే కచ్చితంగా ఇంటర్నేషనల డ్రైవింగ్ పర్మిట్ ఉండాల్సిందే.
ఐడీపీ అంటే ఏంటి? దీనిని ఎలా పొందాలి.
అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (IDP)ను భారతదేశంలో ఉన్న ఆర్‌టిఓ (Regional Transport Office) అధికారులు జారీ చేస్తారు. ఇది 150 దేశాలలో చెల్లుబాటు అవుతుంది. ఐడీపీ పొందాలంటే వ్యాలిడిటీ ఉన్న డ్రైవింగ లైసెన్స్, పాస్‌పోర్ట్ వీసా, లేటెస్ట్ ఫొటోలు, అప్లికేషన్ ఫామ్‌తో పాటు సంబంధిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Driving Licence
ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
విదేశాల్లో డ్రైవింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా ముందుగా ఆ దేశ నిబంధనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఐడీపీ లేకుండా డ్రైవింగ్‌కు అనుమతిచ్చే దేశాల్లో కూడా స్థానిక నిబంధనల గురించి అవగాహన ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు, సీటుబెల్ట్, హెల్మెట్, గరిష్ట వేగ పరిమితి మొదలైనవి తప్పనిసరిగా పాటించాలి. కొన్ని దేశాల్లో కుడి వైపు డ్రైవింగ్ ఉంటుంది. కాబట్టి ముందుగా తగిన శిక్షణ తసుకోవాలి.