PM Modi on Naxalism : దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ "అనేక అడ్డంకులు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ భారత్ ఇప్పుడు అన్స్టాపబుల్" అని అన్నారు. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం అంశంపై మాట్లాడుతూ.. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాకుండా యువత భవిష్యత్తుకు కూడా ముప్పుగా మారిందని తెలిపారు. నక్సలిజం అనే పదం వాస్తవానికి మావోవాద ఉగ్రవాదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అర్బన్ నక్సల్స్ ఏర్పరచిన ఎకోసిస్టమ్ మావో ఉగ్రవాదాన్ని దాచిపెట్టడంలో పెద్ద పాత్ర వహించిందని ఆయన ఆరోపించారు.
25
వారి కథలు వెలుగులోకి రాలేదు : ప్రధాని మోదీ
మావోయిస్టు దాడుల బాధితుల కథలు వెలుగులోకి రాలేదని ప్రధాని మోదీ అన్నారు. చేతులు కాళ్లు కోల్పోయిన గ్రామీణులు, రైతుల కుమారులు, ఆదివాసీ మహిళలు.. ఢిల్లీలో సమావేశమైనప్పటికీ, వారి బాధ దేశ ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మీడియా, అర్బన్ నక్సల్స్ కలసి ఈ ఉగ్రవాదం వెనుక ఉన్న నిజాలను దాచారని ఆయన విమర్శించారు.
35
2014 తర్వాత భారీ మార్పులు
ప్రధాని వెల్లడించిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం దేశంలో 125కు పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా, ప్రస్తుతం కేవలం 11 జిల్లాల్లో మాత్రమే ఈ ప్రభావం మిగిలి ఉంది. వీటిలో మూడు జిల్లాలు అత్యధికంగా ప్రభావితమై ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలతో వేలాది నక్సల్స్ ఆయుధాలు వదిలి జనంలో కలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత 75 గంటల్లో 303 మంది నక్సల్స్ లొంగిపోయారని ప్రధాని మోదీ తెలిపారు. వీరిలో కొందరిపై ₹1 కోటి, ₹15 లక్షలు, ₹5 లక్షల వరకు రివార్డులు కూడా గతంతో ప్రకటించిన విషయాలు ప్రప్తావించారు. వీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని స్వీకరించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. మావోయిస్టు ఉగ్రవాదం దశాబ్దాల పాటు వేలాది ప్రాణాలను తీసిందనీ, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మాణం జరగకుండా అడ్డుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
55
బస్తర్ లో మార్పులు.. అభివృద్ధి, ఆశల దీపావళి
ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచిన బస్తర్ ఇప్పుడు క్రీడా ఉత్సవాలకు కేంద్రంగా మారిందని ప్రధాని అన్నారు. “బస్తర్ ఒలింపిక్స్”లో వేలాది యువకులు పాల్గొంటున్నారనీ, ఈ సంవత్సరం మావోయిస్టు ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. “దేశం మావోయిస్టు ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తికావడానికి ఎంతో దూరంలో లేదు. ఇది మోదీ గ్యారంటీ” అని తన ప్రసంగం ముగించారు.