PM Modi at BRICS: గ్లోబల్ సౌత్ డబుల్ స్టాండర్డ్స్‌కు బలికావటం అన్యాయం.. బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ

Published : Jul 07, 2025, 12:32 AM IST

PM Modi at BRICS: బ్రెజిల్ లో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్‌లో గ్లోబల్ సౌత్ కు న్యాయం జరగలేదని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలకూ పిలుపునిచ్చారు.

PREV
16
బ్రెజిల్‌ 17వ బ్రిక్స్ సమ్మిట్: సమానత్వం, సమగ్ర అభివృద్ధి కోసం పీఎం మోడీ పిలుపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్‌లోని రియో డి జెనెరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇతర దేశాధినేతలతో కలిసి సమ్మిట్‌లో భాగమయ్యారు.

ఈ సమావేశం ప్రసిద్ధ మ్యూజియం ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ వేదికగా జరిగింది. ఈసారి సమావేశానికి కొత్తగా మిస్ర్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా, సౌదీ అరేబియా దేశాలు కూడా బ్రిక్స్ సభ్యులుగా పాలుపంచుకున్నాయి.

26
గ్లోబల్ సౌత్‌కు తక్కువ ప్రాధాన్యత: మోడీ ఆవేదన

బ్రిక్స్ మొదటి ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "గ్లోబల్ సౌత్ తరచూ డబుల్ స్టాండర్డ్స్‌కు బలి అవుతోంది. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రతా అంశాల్లో అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లైమేట్ ఫైనాన్స్, సస్టెయినబుల్ డెవలప్మెంట్, టెక్నాలజీ యాక్సెస్ వంటి కీలక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేవలం ప్రాతినిధ్య సూచనలకే పరిమితం చేశారని" అన్నారు.

36
ప్రపంచ సంస్థల అప్‌డేట్ అవసరమన్న మోడీ

ప్రధాని మోడీ గ్లోబల్ పాలనా వ్యవస్థలపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. మార్పులు రావాలని అన్నారు. "ఏఐ యుగంలో ప్రతి వారం టెక్నాలజీ అప్‌డేట్ అవుతుంటే, 80 ఏళ్లుగా మారని విధంగా ఉండటం సరికాదు. గ్లోబల్ సంస్థలు సమకాలీన ప్రపంచానికి అనుకూలంగా లేవు.. మార్పులు రావాలి" అని అన్నారు.

"21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్‌రైటర్‌లతో నడిపించలేం" అనే వాక్యంతో మోడీ తన సందేశాన్ని స్పష్టం చేశారు.

46
సంస్థల్లో నూతన పాలన, ఓటింగ్ హక్కులు అవసరం : మోడీ

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), మల్టిలాటరల్ డెవలప్మెంట్ బ్యాంకులలో సంస్కరణలు అత్యవసరమని మోడీ సూచించారు. "ఇవి కేవలం ప్రతీకాత్మక సంస్కరణలుగా కాకుండా, పాలనా నిర్మాణం, ఓటింగ్ హక్కులు, నాయకత్వ హోదాల్లో వాస్తవిక మార్పులుగా ఉండాలి" అని అన్నారు.

56
బ్రిక్స్ విస్తరణపై ప్రధాన మోడీ కామెంట్స్

ఇటీవల బ్రిక్స్‌లో కొత్త సభ్యుల చేరికపై ప్రధాని స్పందిస్తూ, "ఇది బ్రిక్స్ కాలానికి అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని చూపిస్తుంది. అదే శక్తిని ఇప్పుడు గ్లోబల్ సంస్థల సంస్కరణలపైనా చూపించాలి" అన్నారు.

ఇది గ్లోబల్ సౌత్‌కు స్వరం ఇవ్వడం మాత్రమే కాదు, ప్రపంచ పాలనలో నమ్మకాన్ని పెంచే అంశమని మోడీ వివరించారు.

కాగా, ఈ బ్రిక్స్ సమ్మిట్‌తో ప్రధాని మోడీ ఐదు దేశాల విదేశీ పర్యటనలో నాల్గవ దశ పూర్తయింది. ఆయన మొదటగా ఘానా, ఆపై ట్రినిడాడ్ అండ్ టొబాగో, తర్వాత అర్జెంటినా, ఇప్పుడు బ్రెజిల్ కు వెళ్లారు. దీని తర్వాత నమీబియాను సందర్శించనున్నారు.

66
ఇతర నాయకులతో ప్రధాని మోడీ మైత్రి స్పష్టంగా కనిపించింది

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా.. "ప్రపంచ సమస్యల పరిష్కారానికి బ్రిక్స్ దేశాల కలిసికట్టుగా ముందుకు సాగడంపై మోడీ, ఇతర నాయకులు బ్రెజిల్ లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు" అని పేర్కొంది.

శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లులాను కలిశారు. అలాగే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామాఫోసాతో మిత్రభావంతో సమావేశమయ్యారు. "ప్రెసిడెంట్ లులా కు ప్రత్యేక కృతజ్ఞతలు" అని మోడీ పేర్కొన్నారు. "ప్రెసిడెంట్ రామాఫోసాను మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ బ్రిక్స్ సమావేశం ద్వారా ప్రధాని మోడీ మరోసారి ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరం వినిపించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలని, మానవతా దృక్పథంతో ప్రపంచ పాలనను పునఃరూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు. 2026లో భారత్ బ్రిక్స్ కు అధ్యక్షత వహించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories