Pahalgam terror attack : పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసత్వం... కాల్పుల వీడియో తీసుకునేందుకు ప్రత్యేక సెటప్

Published : Apr 23, 2025, 05:13 PM ISTUpdated : Apr 23, 2025, 05:17 PM IST

కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కాల్పుల సమయంలో ఉగ్రవాదులు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారు ప్రత్యేక సెటప్ ను ఉపయోగించారట. 

PREV
14
Pahalgam terror attack : పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసత్వం... కాల్పుల వీడియో తీసుకునేందుకు ప్రత్యేక సెటప్
Pahalgam terror attack

Pahalgam terror attack : కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లడమే వారి తప్పయ్యింది... అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.  అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసన్ లోయలో మంగళవారం ఉగ్రవాద దాడులు జరిగాయి. భూలోక స్వర్గంగా పేరుగాంచిన కాశ్మీర్ లోని ప్రకృతి అందాలను చూసేందుకు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసివెళ్లినవారిపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారు. అయితే ఇలా కాల్పులు జరుపుతూ బుల్లెట్లు శరీరంలో చొచ్చుకెళ్లి రక్తమోడుతున్న దృశ్యాలను వీడియోతీసి రాక్షసానందం పొందారట ఈ ముష్కరమూకలు. ఈ విషయాన్ని కాల్పులను కళ్లారాచూసిన పర్యాటకులు తెలియజేసారు. 

సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ముందుగా ఎక్కువమంది గుమిగూడిన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారట. ఆ తర్వాత తుపాకులతో బెదిరించి అందరినీ ఒకచోటికి చేర్చారు... వీరిలో ముస్లింలను వదిలిపెట్టి కేవలం హిందువులనే హతమార్చారు. ఐడెంటిటీ కార్డులు, ఇతర పత్రాలను పరిశీలించి హిందువులని నిర్దారించి హతమార్చారు. ఇలా కాల్చిచంపుతూ ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నారట... ఇందుకోసం ప్రత్యేక కెమెరాతో కూడిన హెల్మెట్లను ధరించినట్లు తెలుస్తోంది. 

ముందుగా టూరిస్టుల్లోని హిందువులను గుర్తించి వారిలోని మగవారిని ఒక్కచోటికి చేర్చారట ఉగ్రవాదులు. అనంతరం వారి తలలకు తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చిచంపారు. ఈ మారణహోమాన్ని తమ హెల్మెట్ మౌంటెడ్ కెమెరాల్లో చిత్రీకరించారు. అయితే ఇలా రికార్డ్ చేసిన వీడియోలను ఇప్పటికే ఉగ్రవాదులు పాకిస్థాన్ లోని తమ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని ఇండియా అనుమానిస్తోంది. 
 

24
Pahalgam terror attack

పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్థాన్ నాటకాలు : 

భారతదేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా దానివెనక పాకిస్థాన్ హస్తం ఉంటుందని అందరికీ తెలుసు. దాయాది దేశం అన్నిరంగాల్లో అద్భుతాలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుంటే చూసి ఓర్వలేకపోతున్న పాక్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్ పై ఉసిగొల్పుతోంది. ఇలా భారత్ లో అలజడికి పాకిస్థాన్ ప్రధాన కారణం అవుతోంది. తాజాగా పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను పొట్టనబొట్టుకోవడం వెనక కూడా పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

 పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఇప్పటికే గుర్తించారు. మొత్తం నలుగురు ముష్కరులు ఈ దాడిలో పాల్గొనగా వారిలో ఇద్దరు కాశ్మీరీలుగా అనుమానిస్తున్నారు. 2018లో కాశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్ లు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మరో ఇద్దరితో కలిసి మళ్లీ కాశ్మీర్లోకి చొరబడ్డ అదిల్, అషన్ లకు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతం బైసన్ లోయ బాగా తెలుసు. అందుకే ఈ ప్రాంతాన్ని దాడులకు ఎంచుకున్నారు. 

ఈ ఉగ్రవాదులకు పాక్ మద్దతుదారుల నుంచి ఏకే-47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించినట్లు అనుమానిస్తున్నారు. అదిల్ గురి, అషన్ల గురించి భద్రతా బలగాలు సమాచారం సేకరిస్తున్నారు. వారికి ఎవరు సహాయం చేసారు? పహల్గాంకు ఆయుధాలతో ఎలా చేరుకున్నారు? తదితర వివరాలను త్వరలోనే బైటపెట్టనున్నారు. 
 

34
Pahalgam terror attack

పహల్గాం ఉగ్రదాడుల వేళ పాక్ కవ్వింపు చర్యలు :  

పహల్గాం ఉగ్రదాడుల వేళ యావత్ దేశం బాధలో ఉండగా పాకిస్థాన్ దొంగ ఏడుపు ఏడుస్తూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నట్లు పాక్ ప్రకటన చేసింది. మరణించివారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామంది.  

అయితే ఇప్పటికే ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్.  ఈ ఉగ్రమూకలకు పాకిస్థాన్ సాయం చేసినట్లు స్పష్టమయ్యింది. అయితే తమకేమీ తెలియదన్నట్లు అంతర్జాతీయ సమాజం ముందు నాటకాలు ఆడుతోంది పాక్. అందుకోసమే ఈ దాడిని ఖండిస్తున్నట్లు కలరింగ్ ఇస్తోంది. 

మరోవైపు సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారీ సైన్యాన్ని మోహరించారు. అలాగే కాశ్మీర్ సరిహద్దుల్లో యుద్ద విమానాలను మొహరించారు.  వివిధ ప్రాంతాల నుండి యుద్ద ట్యాంకర్లు, ఆయుధాలను కాశ్మీర్ సరిహద్దుల్లోకి చేరుస్తోందట పాక్. ఇలా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోందట పాక్. 

44
Pahalgam terror attack

పహల్గాం దాడిపై చైనా స్పందన :    
 
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని చైనా ఖండించింది. భారతదేశంలోని చైనా రాయబారి షు ఫెయ్‌హాంగ్ సోషల్ మీడియాలో ఈ దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, బాధ వ్యక్తం చేశారు. చైనా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చైనా రాయబారి పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, "భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకుల మరణం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని అన్నారు.

 

Read more Photos on
click me!

Recommended Stories