Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా

Published : May 07, 2025, 04:55 AM IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పాకిస్తాన్ తీవ్ర ప్రతిస్పందన ఇస్తుందని చెప్పింది. సరిహద్దులో కాల్పులు కొనసాగుతున్నాయి. 

PREV
17
Operation sindoor: పాక్ ఉగ్ర‌మూక‌ల‌పై భార‌త్ మెరుపు దాడి.. ఫొటోలు చూశారా

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు చేసింది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని పాక్ చెబుతోంది. 

27

మరోవైపు, భారతదేశం దాడి చేసిందని పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్, మురిడ్కే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్, కోట్లీ, బాగ్‌లలో దాడులు జరిగాయని తెలిపింది.

37

ఇక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందిస్తూ, "భారతదేశం మోసపూరితంగా పాకిస్థాన్‌లోని ఐదు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ చర్యలు యుద్ధానికి సమానమైనవే. పాకిస్థాన్ తగిన సమాధానం తప్పక ఇస్తుంది. దేశం మొత్తం సైన్యం వెనుక నిలిచింది. శత్రువు కుట్రలు విఫలమవడం ఖాయం" అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

47

భారతదేశం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను విభజించే నియంత్రణ రేఖ వెంబడి భారీ కాల్పులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి.  పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులకు దిగగా, భారత దళాలు కూడా ప్రతికర్యగా కాల్పులు జరిపాయి. దీంతో ఎల్‌వోసీ ప్రాంతం చుట్టుపక్కల వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

57

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మదరసాలు, మసీదుల నుండి దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. భారత దాడులు జరిగిన వెంటనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను 48 గంటలపాటు మూసివేసింది. 

67

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున భారతీయ దళాలు క్షిపణి దాడులు చేశాయి.  జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా గ్రూపుల ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

77

పాకిస్తాన్ భూభాగంలో భారత క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స్పందించారు. ఈ పరిణామం ఊహించినదేనని, భారత్, పాకిస్తాన్ లు శత్రుత్వాలను త్వరగా ముగించాలని కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories