రాఫెల్ యుద్ధ విమానాలతో పాక్ ని రప్పా రప్పాండించిన భారత్ సైన్యం

Published : May 07, 2025, 04:36 AM IST

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై రాఫెల్‌ యుద్ధ విమానాలతో మెరుపుదాడులు చేపట్టింది.

PREV
16
రాఫెల్ యుద్ధ విమానాలతో పాక్ ని రప్పా రప్పాండించిన భారత్ సైన్యం
రాఫెల్ తో రప్ప..రప్పా

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చలికాలంలా చుట్టుముట్టాయి. ఈ దాడికి బదులుగా భారత ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటల సమయంలో పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు ప్రారంభించింది. 'ఆపరేషన్ సిందూర్' అనే పేరుతో భారత సైన్యం చేపట్టిన ఈ దాడుల్లో, ఇటీవల సమకూర్చిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగించారు.

26
తొమ్మిది ఉగ్ర స్థావరాలను..

భారత వైమానిక దళం, భూసేనలు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టాయి.పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ సైనిక సదుపాయాలను ఉద్దేశించి దాడులు జరపలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తీసుకున్నట్లు వెల్లడించింది.

36
న్యాయం జరిగింది

ఈ దాడుల నేపథ్యంలో భారత రక్షణశాఖ పూర్తివివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అంతేకాకుండా 'న్యాయం జరిగింది' అనే సందేశంతో ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో స్పందించింది. ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

46
ప్రతి స్పందన ఉంటుంది

ఇక పాక్ వైపు నుంచి కూడా స్పందన వచ్చింది. పాకిస్థాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ప్రకారం, మురిడ్కే, బహావల్పూర్, ముజఫరాబాద్, కొట్లీ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ముగ్గురు మరణించగా, 12 మందికి గాయాలయ్యాయని పాక్ ప్రకటించింది. దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించింది.

56
శత్రువుకు సరైన బుద్ధి

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందిస్తూ, దేశంలో ఐదు ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఇది యుద్ధ చర్యలేనని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా సైన్యం వెనుక ఉన్నారని, శత్రువుకు సరైన బుద్ధి చెబుతామని అన్నారు.దాడుల అనంతరం ఎల్‌వోసీ వెంబడి కాల్పులు ప్రారంభమయ్యాయి. పూంఛ్, రాజౌరి ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరపగా, భారత్ కూడా స్పందించింది. ఈ పరిణామాలతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

66
భారత్ మాతా కీ జై

భారత దాడుల నేపథ్యంలో పాక్ అప్రమత్తమై, లాహోర్‌, సియాల్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారుడితో మాట్లాడి పరిస్థితుల వివరాలు ఇచ్చారు.

ప్రస్తుతం భారత్‌లో అంతటా మాక్ డ్రిల్స్‌ నిర్వహించనున్న సమయంలో ఈ మెరుపుదాడులు చోటు చేసుకోవడం ఉత్కంఠను మరింత పెంచింది. ప్రభుత్వ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ స్పందిస్తున్నారు. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యుద్ధ సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

Read more Photos on
click me!

Recommended Stories