Nanda devi mystery: హిమాల‌యాల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అణు ప‌రికరం.? 60 ఏళ్లు గ‌డిచినా వీడ‌ని ర‌హ‌స్యం

Published : Jul 07, 2025, 11:55 AM IST

చ‌రిత్ర త‌న‌లో ఎన్నో ర‌హ‌స్యాల‌ను దాచుకుంటుంది. అయితే ఇప్ప‌టికీ స‌మాధానం ల‌భించ‌ని ర‌హ‌స్య‌లు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఓ ర‌హ‌స్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
నందాదేవి ప‌ర్వ‌తంపై ర‌హ‌స్య మిష‌న్

సుమారు 60 ఏళ్ల క్రితం, 1965లో భార‌త్‌, అమెరికా క‌లిసి ఓ ర‌హ‌స్య మిష‌న్‌ను చేపట్టాయి. నందాదేవి ప‌ర్వ‌తంపై అణుశ‌క్తితో ప‌నిచేసే ఒక ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం చైనాను గ‌మ‌నించ‌డానికే. భారత నౌకాదళ అధికారుడు, ప్రసిద్ధ పర్వతారోహకుడు కెప్టెన్ మన్మోహన్ సింగ్ కోహ్లీ నేతృత్వంలో ఇండియా-అమెరికా కలిపిన బృందం ఈ మిష‌న్‌ను చేప‌ట్టింది.

ఈ పరికరం ప్లూటోనియంతో పని చేస్తుంది. ఇది అతి ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థం. అయితే ప‌ర్వ‌తంపై ఆ స‌మ‌యంలో తీవ్ర తుఫాను కార‌ణంగా వారు ఆ ప‌రిక‌రాన్ని రాళ్ల‌కు క‌ట్టేసి అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయారు. వాతావ‌ర‌ణం చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ల‌గా వారికి ఆ ప‌రిక‌రం క‌నిపించ‌లేదు. దీంతో అది మంచులో కురుకుపోయిన‌ట్లు అంతా భావించారు.

25
ఈ మిష‌న్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.?

ఈ మిషన్ వెనుక అసలు ఉద్దేశం చైనా అణు పరీక్షలపై నిఘా పెట్టడం. అప్పటికి చైనా తన మొదటి అణుబాంబ్ పరీక్ష జరిపింది. అమెరికాకు అది పెద్ద ఆందోళనగా మారింది. అప్ప‌టికీ ఇంకా శాటిలైట్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంద‌లేవు దీంతో నేరుగా హిమాల‌యాల నుంచి చైనాను చూసే స్థావరం కావాలి.

ఇందులో భాగంగానే నందాదేవి పర్వతాన్ని ఎంచుకున్నారు. అక్కడ పరికరం ఉంచితే చైనా అణు స్థావరాలపై నిఘా పెట్టొచ్చు అనుకున్నారు. అయితే భీక‌ర‌మైన మంచు, అనుకూలించ‌ని వాతావ‌ర‌ణం కార‌ణంగా ఈ మిష‌న్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

35
ప్లూటోనియం ప్ర‌మాదం

తీవ్ర తుఫాన్ కారణంగా ఆ పరికరం అక్కడే వదిలిపెట్టగా, తిరిగి దానిని గుర్తించే ప్ర‌య‌త్నం చేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అయితే ఆ ప‌రికంలో ఉండే ఫ్లూటోనియంతోనే ఇప్పుడు భ‌యంనెల‌కొంది. అది బయటకు వస్తే, మంచు కరుగుతూ గంగానదిలో క‌ల‌వ‌డం ద్వారా నీరు విష‌పూరిత‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. దీంతో 60 ఏళ్ల నాటి సంఘ‌ట‌న ఇప్ప‌టికీ భ‌యాన్ని క‌లిగిస్తూనే ఉంది.

45
ఆ ప‌రిక‌రం ఇంకా అక్క‌డే ఉందా.?

ఇన్నేళ్ల‌యినా నందాదేవి ర‌హ‌స్యం మిస్ట‌రీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ నందాదేవి ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికల బోర్డులు ఉండవు. టూరిస్టులు, ట్రెక్కర్లు నడుస్తున్న ఆ గడ్డిమైదానాల క్రింద ప్లూటోనియం పరికరం ఉండే అవకాశముంది. గ్లేసియర్ నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఒకరోజు అది బయటపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ పరికరాన్ని మోసిన కొంతమంది పోర్టర్లు ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే అనారోగ్యం పాలై మరణించారని స్థానికులు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించి ప్ర‌త్య‌క్ష సాక్షులు ఎవ‌రూ లేక‌పోయినా స్థానికుల్లో మాత్రం ఆ భ‌యం ఇంకా అలాగే ఉండి పోయింది.

55
ఎవ‌రీ కెప్టెన్ కోహ్లీ

ఈ మిష‌న్ గురించి తెలుసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో దీనికి నాయ‌క‌త్వం వ‌హించిన కెప్టెన్ కోహ్లీ గురించి తెలుసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. కెప్టెన్ కోహ్లీ 1932లో జన్మించాడు. దేశ విభజన సమయంలో 15 ఏళ్ల వయస్సులో రిఫ్యూజీగా ఇండియాకు వచ్చాడు. తర్వాత నౌకాదళంలో చేరి మౌంట్ ఎవరెస్ట్ అదిరోహించ‌డంలో

నిపుణుడయ్యాడు. అతని గురువు ఎవరెస్ట్ లెజెండ్ టెన్సింగ్ నోర్గే కావ‌డం విశేషం. 965లో అతను నాయకత్వం వహించిన బృందం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఏకంగా 9 మంది భారతీయులు శిఖరాన్ని అధిరోహించారు. అప్ప‌ట్లో అది ప్ర‌పంచ రికార్డు ఈ విజయాన్ని అప్ప‌టి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి “దేశ గర్వకారణం”గా అభివర్ణించారు.

Read more Photos on
click me!

Recommended Stories