Mobile Alert: ఈరోజు మీ ఫోన్ల‌లో ఒక్క‌సారిగా సైర‌న్ మోగ‌నుంది.. ఏం భ‌య‌ప‌డ‌కండి, ఇంత‌కీ ఇది ఏంటంటే

Published : May 02, 2026, 07:03 AM IST

Mobile Alert: దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు కీలక సమాచారం. ఈరోజు (మే 2న) కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అత్యవసర అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించనుంది. ఈ సందర్భంగా లక్షలాది ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించడంతో పాటు ఓ మెసెజ్ రానుంది. 

PREV
15
ఏం జరగబోతోంది?

మే 2న దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు ఒక ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం పంప‌నున్నారు. ఈ సందేశం వచ్చినప్పుడు ఫోన్‌లో గట్టిగా సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఫోన్ వైబ్రేట్ అవుతుంది, స్క్రీన్‌పై ప్రత్యేక హెచ్చరిక సందేశం కనిపిస్తుంది. ఫోన్ సైలెంట్‌లో ఉన్నా కూడా ఈ అలర్ట్ వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

25
ఈ టెస్ట్ వెనుక ఉద్దేశం

ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సమాచారం చేరేలా చేయడం ఈ సిస్టమ్ లక్ష్యం. వరదలు, తుపానులు, భూకంపాలు వంటి సందర్భాల్లో కొన్ని సెకన్లలోనే హెచ్చరికలు అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష ద్వారా సిస్టమ్ పనితీరును తనిఖీ చేసి, భవిష్యత్తులో మరింత సమర్థంగా ఉపయోగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

35
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.?

ఈ అలర్ట్ సిస్టమ్‌ను “సాచెట్ (SACHET)” పేరుతో రూపొందించారు. ఇది కామ‌న్ అల్ట‌రింగ్ ప్రొటోకాల్ (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించిన ఈ విధానం ద్వారా.. ఒకేసారి లక్షల మందికి మెసేజ్ చేరుతుంది. నెట్‌వర్క్ జాప్యం లేకుండా నేరుగా ఫోన్‌కు సమాచారం అందుతుంది. ప్రమాద ప్రాంతాల్లో ఉన్న ఫోన్లకు మాత్రమే అలర్ట్ పంపే సౌకర్యం ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది.

45
ఆంధ్రప్రదేశ్‌లో ఏ స‌మ‌యంలో.?

ఆంధ్రప్రదేశ్‌లో ఈ టెస్ట్ అలర్ట్ ప్రత్యేకంగా ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య పంప‌నున్నారు. ఈ సమయంలో మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చినా, సైరన్ శబ్దం వినిపించినా అది కేవలం పరీక్షలో భాగమే అని గుర్తించండి.

55
ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

ఇది కేవలం టెస్ట్ మాత్రమే – ఎలాంటి ప్రమాదం లేదు. మెసేజ్ వచ్చినప్పుడు ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్ శబ్దం ఎక్కువగా వచ్చినా కంగారు పడకండి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, ఇతరులకు కూడా తెలియజేయండి. దేశంలో అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక అడుగు. భవిష్యత్తులో ప్రాణనష్టం తగ్గించడంలో ఈ టెక్నాలజీ ముఖ్య పాత్ర పోషించనుంది. కాబట్టి ఈరోజు మీ ఫోన్ మోగితే అది మీ భద్రత కోసం జరుగుతున్న పరీక్షగా భావించండి.

Read more Photos on
click me!

Recommended Stories