Indian Railways: ట్రైన్ టికెట్ కొంటే చాలు... ఈ సర్వీసులన్నీ మీకు ఫ్రీ

Published : Apr 30, 2026, 06:28 PM IST

Indian Railways: రైలు టికెట్ అంటే కేవలం ప్రయాణం కోసమే అనుకుంటే మీరు చాలా మిస్ అవుతున్నట్లే. నిజానికి ఒక టికెట్‌తో ప్రయాణికులకు తెలియని అనేక ఉచిత సౌకర్యాలు కూడా లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
భారతీయ రైల్వేలో ఉచిత సేవలు

మనదేశంలో రోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఖర్చు తక్కువ, హాయిగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే బెస్ట్ ఆప్షన్. కానీ చాలా మందికి తెలియని విషయమేంటంటే.. రైలు టికెట్ కొన్న ప్రయాణికులకు కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా ఉంటాయి. భారతీయ రైల్వే అందించే ఈ సేవలు మీ ప్రయాణాన్ని మరింత సులభంగా, సురక్షితంగా మారుస్తాయి. 

26
1. వెయిటింగ్ రూమ్
రైల్వే స్టేషన్లలో ఉండే ముఖ్యమైన సౌకర్యాల్లో 'వెయిటింగ్ రూమ్' ఒకటి. రైలు ఆలస్యమైనా లేదా మీరు స్టేషన్‌కు తొందరగా వచ్చినా, ఇక్కడ ఉచితంగా కూర్చుని సేద తీరొచ్చు. చాలా ప్రధాన స్టేషన్లలో ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుంది.
36
2. ఉచిత వైఫై
ఇప్పటి రోజుల్లో ఇంటర్నెట్ చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, చాలా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నారు. మీ మొబైల్ డేటా వాడకుండానే రైలు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్ పనులు పూర్తిచేయొచ్చు. ముఖ్యంగా సిగ్నల్ సరిగా లేని చోట ఇది బాగా ఉపయోగపడుతుంది.
46
3. ఏసీ బుక్ చేసుకున్న వారికి సౌకర్యం
ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ బెడ్‌షీట్, దిండు, దుప్పటిని ఉచితంగా ఇస్తుంది. దీనికోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో, చలికాలం లేదా వర్షాకాలంలో ఈ సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
56
4. వైద్యసేవలు ఉచితం
ప్రయాణ సమయంలో ఆరోగ్యం పాడైతే, రైల్వే శాఖ సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందిస్తారు. అవసరమైతే, తర్వాతి స్టేషన్‌లో డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.
66
5. ఇతర సేవలు
ఇవి కాకుండా, ప్రయాణంలో ఏమైనా సమస్య వస్తే టీటీఈ, కోచ్ అటెండెంట్ లేదా రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా సహాయం పొందొచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఈ సేవలు చాలా ముఖ్యం. ఈ ఉచిత సౌకర్యాల గురించి తెలుసుకుని, వాడుకుంటే మీ రైలు ప్రయాణం మరింత ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటుంది.
Read more Photos on
click me!

Recommended Stories