Free Health Care : ఉచిత వైద్యంలో నెంబర్ వన్.. శ్రీ మధుసూదన్ సాయి మెడికల్ కాలేజీకి NABH గుర్తింపు

Published : Apr 30, 2026, 07:37 PM IST

Free Health Care : కర్ణాటకలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (SMSIMSR)కు ప్రతిష్ఠాత్మక NABH గుర్తింపు లభించింది. ఉచిత వైద్య సేవల్లో ఈ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది.

PREV
13
ఉచిత వైద్యంలో నెంబర్ వన్: చరిత్ర సృష్టించిన శ్రీ మధుసూదన్ సాయి మెడికల్ కాలేజీ!

దేశంలోనే మొట్టమొదటి ఉచిత గ్రామీణ వైద్య కళాశాలగా పేరుగాంచిన శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (SMSIMSR)కు జాతీయ స్థాయి నాణ్యతా గుర్తింపు లభించింది. ఈ సంస్థకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (NABH) నుంచి 'ఎంట్రీ-లెవల్ అక్రిడిటేషన్' లభించినట్లు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' మిషన్‌లో భాగంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఇది మరో ప్రతిష్ఠాత్మక ఘనతగా నిలిచింది.

కర్ణాటకలోని ముద్దెనహళ్లి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా, ఆ వైద్యం అత్యున్నత ప్రమాణాలతో కూడి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోగుల భద్రత, ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవల నాణ్యతలో జాతీయ ప్రమాణాలను SMSIMSR పాటిస్తోందని NABH ధృవీకరించింది. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమయ్యే ఇటువంటి గుర్తింపులు, పూర్తిగా ఉచిత సేవలు అందించే ఒక గ్రామీణ సంస్థకు రావడం విశేషం.

23
SMSIMSR మెడికల్ సూపరింటెండెంట్ ఏం చెప్పారంటే?

ఈ గుర్తింపు ప్రాధాన్యం గురించి SMSIMSR మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మశ్రీ కీలక విషయాలు వెల్లడించారు. "మన దేశంలో దాదాపు 80 వేల నుంచి 90 వేల ఆసుపత్రులు ఉన్నాయి. కానీ అందులో కేవలం 1.4 శాతం ఆసుపత్రులకు మాత్రమే పూర్తి స్థాయి అక్రిడిటేషన్ ఉంది. మరో 3 శాతం ఆసుపత్రులు ఎంట్రీ-లెవల్ గుర్తింపు పొందాయి. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తూ ఈ స్థాయి ప్రమాణాలను అందుకోవడం చాలా అరుదు" అని పేర్కొన్నారు. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో భవిష్యత్తులో పూర్తి స్థాయి NABH గుర్తింపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

33
రోగుల భద్రతకు పెద్దపీట

NABH గుర్తింపు రావడంతో ఈ ఆసుపత్రిలో రోగులకు అందే సేవలపై మరింత నమ్మకం పెరిగింది. బలమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ వ్యవస్థలు, పారదర్శకమైన వైద్య విధానాలు, సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ పక్కాగా అమలు అవుతున్నాయి. కేవలం చికిత్స మాత్రమే కాకుండా, వైద్య విద్యార్థులకు కూడా సాక్ష్యాధారిత వైద్యం పై శిక్షణ పొందే అవకాశం ఇక్కడ లభిస్తోంది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' సంకల్పానికి ఈ అక్రిడిటేషన్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

ఆరోగ్య రంగంలో సరికొత్త ఒరవడి

గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాల విషయంలో వెనుకబడి ఉంటాయనే ముద్రను SMSIMSR తుడిచిపెట్టేసింది. ఉచిత వైద్యం అంటే నాణ్యత లేని వైద్యం కాదు అని ఈ సంస్థ నిరూపిస్తోంది. సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే మానవతా దృక్పథం ఇక్కడ కనిపిస్తుంది. జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఆరోగ్య సంస్థలకు ఈ కాలేజీ ఇప్పుడు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories