Law: 15 ఏళ్లు క‌లిసున్న త‌ర్వాత పాట్న‌ర్‌పై లైంగిక వేధింపుల కేసు.. సుప్రీం కోర్టు ఏమందంటే

Published : May 02, 2026, 02:35 PM IST

Law: 15 సంవత్సరాలు కలిసి లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న తర్వాత ఒక్కసారిగా లైంగిక‌ వేధింపుల ఆరోపణలు చేయవచ్చా అనే ప్రశ్నపై ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన విచారణ పెద్ద చర్చకు దారి తీసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.? 

PREV
15
15 ఏళ్ల త‌ర్వా ఎలా ఆరోపిస్తారు.?

ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తితో 15 సంవత్సరాల పాటు కలిసి జీవించి, వారి మధ్య పిల్లలు కూడా ఉన్న పరిస్థితిలో అకస్మాత్తుగా వివాహం చేసుకోల‌ద‌న్న కార‌ణంతో.. లైగింక వేధింపులంటూ ఆరోపణలు చేయడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. సంబంధం సుదీర్ఘంగా కొనసాగినప్పుడు దానిలో పరస్పర అంగీకారం ఉందని భావించాల్సి ఉంటుందని కోర్టు సూచించింది. సంబంధం విరిగిన తర్వాత దానిని నేరంగా మార్చే ప్రయత్నాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది.

25
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై చట్టం ఏమంటుంది?

భారత చట్టాల ప్రకారం లివ్-ఇన్ రిలేషన్ నేరం కాదు. ఇది ఇద్దరు పెద్దల స్వేచ్ఛా నిర్ణయంగా ప‌రిగ‌ణిస్తారు. అయితే దీనికి ప్రత్యేకంగా చట్టం లేకపోవడంతో కోర్టు తీర్పుల ఆధారంగా కొన్ని మార్గదర్శకాలు ఏర్పడ్డాయి. ఒక సంబంధం చాలా కాలం పాటు కొనసాగితే దాన్ని “వివాహంలాంటి సంబంధం”గా కోర్టు గుర్తించే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బ్రేకప్ జరిగినప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయడం సులభం కాదు. సంబంధం స్వచ్ఛందంగా సాగిందా లేదా అనే అంశాన్ని కోర్టు ముఖ్యంగా పరిశీలిస్తుంది.

35
వేధింపుల కేసుల్లో “సమ్మతి” కీలకం

ఇలాంటి కేసుల్లో ప్రధానంగా చూసే అంశం సమ్మతి. ఒక మహిళ చాలా సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో కలిసి జీవించినప్పుడు, ఆ సంబంధం ప్రారంభంలోనే ఆమె అంగీకారం ఉందని కోర్టు భావించే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మొదటి నుంచే వివాహం పేరుతో మోసం చేసి శారీరక సంబంధానికి ఒప్పించారని నిరూపించగలిగితే పరిస్థితి మారుతుంది. అప్పుడు దానిని నేరంగా పరిగణిస్తారు. కానీ సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగి, తర్వాత విభేదాల కారణంగా ముగిసినట్లయితే, ఆ తర్వాత లైంగిక‌ దాడి ఆరోపణలు చేయడాన్ని కోర్టు సుల‌భంగా అంగీక‌రించ‌దు.

45
భార్య భర్తపై లైంగింక వేధింపుల కేసు పెట్టొచ్చా.?

భార్య-భర్త సంబంధంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యకు తన ఇష్టానికి విరుద్ధంగా శారీరకంగా క‌ల‌వాల‌ని అనుకోవ‌డం తప్పే. ఇలాంటి సందర్భాల్లో ఆమెకు గృహ హింస చట్టం, 2005 కింద రక్షణ ఉంటుంది. భార్య తన అనుమతి లేకుండా బలవంతంగా సంబంధం పెట్టుకున్నాడని భావిస్తే ఫిర్యాదు చేయవచ్చు. అంటే వివాహం ఉన్నప్పటికీ మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ, అంగీకారం చాలా ముఖ్యమైనవి అని చట్టం స్పష్టం చేస్తోంది.

55
మోసం, సమ్మతి మధ్య తేడా

లివ్-ఇన్ సంబంధాల్లో కోర్టు ప్రధానంగా మోసం జరిగిందా లేదా అన్న విషయాన్ని గమనిస్తుంది. ఒక మహిళను పెళ్లి చేస్తానని నమ్మబలికి, ఆ నమ్మకంతో శారీరక సంబంధం కొనసాగించినట్లు నిరూపిస్తే కేసు బలపడుతుంది. అయితే ఇద్దరి అంగీకారంతో సంబంధం కొనసాగి, తర్వాత విభేదాల వల్ల విడిపోయినట్లయితే, చాలా కాలం తర్వాత వచ్చిన ఆరోపణలను కోర్టు అనుమానంతో పరిశీలిస్తుంది. వ్యక్తిగత విభేదాలు లేదా భావోద్వేగ కారణాలతో క్రిమినల్ కేసులను ఉపయోగించకూడదనే దృష్టితో కోర్టు వ్యవహరిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories