Alcohol Consumption: దేశంలో మద్యం ఎక్కువగా తాగే నగరం ఏంటో తెలుసా.? హైదరాబాద్ అనుకుంటున్నారా..?

Published : Aug 01, 2025, 11:29 AM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందు బాబులు మాత్రం వదలరు. రాష్ట్రాల ఖజానాకు అత్యధిక వాటా మద్యం నుంచే వస్తుందని తెలిసిందే. అయితే దేశంలో ఏ నగర ప్రజలు ఎక్కువగా మద్యం తాగుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
15
దేశంలో పెరుగుతోన్న మద్యం వినియోగం

భారతదేశంలో మద్యం సేవించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రతి సంవత్సరం బిలియన్ల లీటర్ల మద్యం వినియోగం జరుగుతోంది. ప్రముఖ ఆర్థిక పరిశోధన సంస్థ ICRIER, లా కన్సల్టింగ్ సంస్థ PLR చాంబర్స్ సంయుక్త నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ నగరాల్లో ఎక్కువ మద్యం తాగుతారన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

DID YOU KNOW ?
ఎంత శాతం మద్యం సేవిస్తున్నారు.?
2019 లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) ప్రకారం ~15% పురుషులు, ~2% మహిళలు మద్యం సేవిస్తున్నారని తేలింది.
25
ఏ రాష్ట్రంలో ఎక్కువంటే

ఈ నివేదికలో తేలిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం జనాభాలో 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సంఖ్య దేశ సగటుతో పోల్చితే చాలా ఎక్కువ కావడం గమనార్హం. మనీ కంట్రోల్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొన్నారు. 

35
మద్యం తాగే నగరాల జాబితా

2021 సర్వే వివరాల ప్రకారం, మద్యం వినియోగంలో కోల్‌కతా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మద్యం సేవించే వారి శాతం 32.9%. ఇది దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఎక్కువ. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో సుమారు 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు.

45
ఢిల్లీ, చండీగఢ్, ముంబై ర్యాంకులు

కోల్‌కతా తర్వాత మద్యం వినియోగంలో ఢిల్లీ 31% శాతంతో రెండో స్థానంలో ఉంది. చండీగఢ్‌లో 29.1% మంది మద్యం సేవిస్తుండగా, ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సంఖ్య 28.1%గా ఉంది. ఈ నగరాల్లో కూడా మద్యం వినియోగం అధికంగా ఉండటం గమనార్హం.

55
ఇతర నగరాల గణాంకాలు

లక్నోలో మద్యం సేవించే వారి శాతం 27.9% కాగా, ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరులో ఇది 27.3%గా ఉంది. పుణేలో మద్యం సేవించే వారు 26.2% ఉండగా, భువనేశ్వర్‌లో ఈ సంఖ్య 24.9%గా నమోదైంది. ఈ గణాంకాలు దేశ వ్యాప్తంగా మద్యం వినియోగం పెరుగుతున్న దృశ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories