Malegaon Blast Case Verdict 2025: మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు (NIA court) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ (Pragya Singh Thakur) సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో (Malegaon blast case)ముంబయి లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు (NIA court judgment) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ (Pragya Singh Thakur) సహా మొత్తం ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
25
అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని మాలేగావ్ లో 2008 సెప్టెంబర్ 29న మసీదు సమీపంలో జరిగిన పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైక్ కు అమర్చిన ఐఈడీ బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించింది. మొదట ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం విచారణ చేపట్టింది. ఆ తర్వాత 2011 లో ఈ కేసు ఎన్ఐఏకు అప్పగించారు.
35
17 ఏళ్ల తరువాత తుది తీర్పు
మాలేగావ్ కేసు దర్యాప్తు దాదాపు 17 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో కోర్టు 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఆయుధ చట్టం, అన్ని ఇతర అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ తో సహా ఏడుగురు నిర్దోషులేనని ఎన్ఐఏ కోర్టు తుదితీర్పు వెలువరించింది.
ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి తో పాటు మరో ఐదుగురు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ని ప్రధాన నిందితురాలు ఆరోపించారు. ఈ పేలుడుకు ఉపయోగించిన బైక్ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ పేరుతో రిజిస్టర్ అయిందనీ ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ కేసు దర్యాప్తు సర్వత్రా ఉత్కంఠ రేపింది.
55
కోర్టు ఏం చెప్పిందంటే.. ?
దాదాపు 17 సంవత్సరాల తర్వాత, ముంబైలోని ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కోర్టు గురువారం 2008 మాలేగావ్ పేలుళ్ల కేసుపై తీర్పు వెలువరించింది. మాజీ BJP ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, మాజీ ఆర్మీ అధికారి శ్రీకాంత్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. మరణించిన బాధితులకు రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.