Railway Charges Hike : జూలై 1 నుండి రైల్వే ఛార్జీలు పెంపు ... ఎంతో తెలుసా?

Published : Jun 25, 2025, 09:53 AM ISTUpdated : Jun 25, 2025, 10:09 AM IST

భారతీయ రైల్వే ప్రయాణికులపై భారం మోపింది. టికెట్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ… ఎంతమేర పెరిగాయో తెలుసా? 

PREV
15
జూలై 1 నుండి రైల్వే ఛార్జీల మోత

Indian Railways : రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ బ్యాడ్ న్యూస్ తెలిపింది. టికెట్ ఛార్జీలను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుండి ఈ ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ప్రయాణికులపై పెద్దగా భారం మోపకుండానే మరింత మెరుగపర్చే ఉద్దేశ్యంతో స్వల్పంగా ఛార్జీలు పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది.

25
రైల్వే ఛార్జీలు ఎంత పెరిగాయంటే...

అన్ని రైళ్ళలో టికెట్ ఛార్జీల పెంపు ఉండదని.. కేవలం కొన్నింటికి మాత్రమే పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసి తరగతులలో కిలో మీటర్ పై ఒక పైసా, ఏసీ తరగతులపై కిలో మీటర్ కు 2 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు.

35
ఈ రైళ్ళలో టికెట్ల పెంపు లేదు

ఇక సాధారణ ప్రజలు ప్రయాణించే ఆర్డినరీ సెకండ్ క్లాస్ లో 500 కిలోమీటర్ల లోపు ఛార్జీల పెంపు లేదు. అంతకంటే ఎక్కువదూరం ప్రయాణించేవారికి కిలో మీటర్ కు అరపైస అదనంగా వసూలు చేస్తారు. 

ఇక సబర్బన్ రైళ్లలో టికెట్ల పెంపు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణించేవారిపై కూడా ఎలాంటి భారం మోపలేదు రైల్వే శాఖ. నెలవారి సీజన్ టికెట్ పై ఛార్జీలు పెంచడంలేదని తెలిపారు.

45
పదేళ్ళలో రెండోసారి రైల్వే ఛార్జీల పెంపు

కరోనా సమయంలో భారతీయ రైల్వే తీవ్ర నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలపై ఎలాంటి భారం మోపలేదు. కోవిడ్ 19 తర్వాత మొదటిసారి ఛార్జీలను పెంచారు... అది కూడా పరిగణలోకి తీసుకోలేనంత తక్కువ పెంచారు. ఈ పెంపు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు, రైల్వే నిర్వహణ కోసం తప్పలేదని రైల్వే శాఖ అంటోంది.

ఇంతకుముందు 2020 ఆరంభంలోనే సేమ్ ఇప్పటిలాగే అతి తక్కువగా రైల్వే ఛార్జీలు పెంచారు. క్లాసులను బట్టి కిలోమీటర్ కు పైసా నుండి నాలుగు పైసలు పెంచారు. ఈ ఐదేళ్లు ఎలాంటి ఛార్జీల పెంపు లేదు... మళ్లీ ఇప్పుడు స్వల్పంగా పెంచారు.

55
తత్కాల్ టికెట్ బుకింగ్ లో మార్పులు

రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ సేవల్లో కూడా మార్పులు చేపట్టింది. జూలై 1, 2025 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. అంటే ఆధార్ కార్డును ఉంటేనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజ కార్పోరేషన్ (IRCTC) ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇక జూలై 15 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తో లింక్ అయిన ఫోన్ కు OTP వచ్చేలా మరో మార్పు చేపట్టారు. ఈ ఓటిపిని ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్ లో దళారులు, ఏజెంట్ల ప్రమేయం తగ్గించి నిజంగా అవసరమున్న ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే టికెట్స్ పొందేలా చర్యలు చేపట్టింది రైల్వే శాఖ.

Read more Photos on
click me!

Recommended Stories