Talented Kids in India : చిన్నోళ్లే కానీ చిచ్చరపిడుగులు ... ఇండియాలోని టాప్ 10 టాలెంటెడ్ కిడ్స్ వీరే!

Published : Mar 29, 2025, 04:05 PM ISTUpdated : Mar 29, 2025, 04:08 PM IST

భారతదేశంలో చాలామంది అసాధారణ ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు.. తమ టాలెంట్ తో జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి టాప్ 10 టాలెంటెండ్ ఇండియన్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. 

PREV
110
Talented Kids in India :  చిన్నోళ్లే కానీ చిచ్చరపిడుగులు ... ఇండియాలోని టాప్ 10 టాలెంటెడ్ కిడ్స్ వీరే!
Praggnanandhaa

రమేష్‌బాబు ప్రజ్ఞానంద : అతి చిన్న వయసులో గొప్ప చెస్ ఆటగాడిగా ఎదిగాడు ప్రజ్ఞానంద. అతడు కేవలం 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. రమేష్‌బాబు 7 ఏళ్లకే ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్ గెలిచాడు. 2023 లో చెస్ ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచాడు. 

210
Harshit Dwivedi

అర్షిత్ ద్వివేది : బెంగళూరుకు చెందిన అర్షిత్ వయస్సు 10 ఏళ్లు... కానీ అతని IQ 142. అర్షిత్ జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ప్రోగ్రామ్ కోసం అర్హత సాధించాడు.

310
Lydian Nadhaswaram

లిడియన్ నాదస్వరం : సంగీతంలో మంచి ప్రతిభ ఉన్న లిడియన్ 'ది వరల్డ్స్ బెస్ట్ టాలెంట్ షో' గెలిచిన తర్వాత బాగా పాపులర్ అయ్యాడు. అతను చాలా సినిమాలకు సంగీతం కూడా అందించాడు.

410
Priyanshi Somani

ప్రియాన్షి సోమని : భారతదేశంలో అతి చిన్న వయస్సులోనే హ్యూమన్ క్యాలిక్యులేటర్‌గా గుర్తింపు పొందిన ప్రియాన్షి. 2010లో అతి చిన్న వయస్సులోనే మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్ సాధించింది.

510
Kautilya Pandit

కౌటిల్య పండిత్ : గూగుల్ బాయ్‌గా పేరుగాంచిన కౌటిల్య చరిత్ర, భూగోళంపై తనకున్న అపారమైన జ్ఞానంతో బాగా పాపులర్ అయ్యాడు.

610
Advait Kolarkar

అద్వైత్ కొలార్కర్ : ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయస్సులోనే చిత్రకారులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అద్వైత్ తన ఆర్ట్ వర్క్‌తో ఎగ్జిబిషన్ కూడా పెట్టాడు.

710
Nihal Raj

నిహాల్ రాజ్ : తన వంట నైపుణ్యాలతో పాపులర్ అయిన నిహాల్ తన సొంత వంటకాలను యూట్యూబ్ లో షేర్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు.

810
Pari Sinha

పరి సిన్హా : కేవలం 4 సంవత్సరాల వయస్సులోనే మాస్టర్ చెస్ ప్లేయర్ అయింది పరి. ఆమె స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొంది.

910
Licypriya Kangujam

లిసిప్రియా కంగుజం అవగాహన పెంచే ప్రయత్నాలకు గుర్తింపు పొందింది. పర్యావరణ సమస్యలపై చాలాసార్లు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడింది.

1010
Deshana Aditya Nihar

దేశన ఆదిత్య నిహర్ : ఫూణేకు చెందిన లింబో స్కేటర్ దేశన. చిన్న వయస్సులోనే తన ప్రత్యేక ప్రతిభను చూపించింది. ఆమె క్రీడల్లో సాధించిన విజయాలకు గుర్తింపు పొందింది.

Read more Photos on
click me!

Recommended Stories