గౌతమ్ సింఘానియా, నవాజ్ మోడీ
రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, నవాజ్ మోడీ 2023 విడాకులు తీసుకున్నారు. ఇది ఇండియాలోనే ఖరీదైన విడాకులుగా చెప్పుకుంటారు. ఈ సమయంలో భార్యకు సింఘానియా రూ.8,700 కోట్లు భరణంగా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
హృతిక్ రోషన్, సుజాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, ఇంటీరియర్ డిజైనర్ సుజాన్ ఖాన్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో హృతిక్ దాదాపు రూ. 380 కోట్లు భార్యకు భరణంగా చెల్లించాడు.
సమంత, నాగ చైతన్య
ఖరీదైన విడాకుల జాబితాలో మన తెలుగు జంట నాగ చైతన్య, సమంత విడాకులు కూడా ఉన్నాయి. 2021 లో ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ విడిపోయారు. ఇలా విడాకుల నేపథ్యంలో చైతన్య ఏకంగా రూ.200 కోట్లు భార్యకు భరణంగా చెల్లించాడనే ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంతో గానీ ఇది కాస్ట్లీ విడాకుల జాబితాలో చేరిపోయింది.
ఆమిర్ ఖాన్, రీనా దత్తా
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా విడాకులు ఇచ్చాడు. వీళ్లు 16 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతూ 2002లో విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ భార్యకు దాదాపు రూ. 50 కోట్లు భరణంగా ఇచ్చినట్లు సమాచారం.
కరిష్మా కపూర్, సంజయ్ కపూర్
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ 2016 లో భర్త సంజయ్ కపూర్ కు దూరమయ్యారు. ఈ జంట 2016లో విడాకులు తీసుకుంది. వీరి విడాకుల ఒప్పందంలో ఆమెతో పాటు పిల్లల కోసం దాదాపు రూ. 14 కోట్ల బాండ్లు ఉన్నాయి.
మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్
భాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హీరోయిన్ మలైకా అరోనాను వివాహమాడాడు. 20 ఏళ్లపాటు సజావుగా సాగిన వీరి వివాహబంధం 2017 లో తెగిపోయింది. విడాకుల సందర్భంగా అర్బాజ్ మలైకాకు రూ. 10-15 కోట్లు ఇచ్చాడని సమాచారం.
సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్
భాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతా సింగ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఇందుకోసం ఇద్దరూ రూ. 5 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ
క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు ఇచ్చాడు. ఈ విడాకుల కోసం అతడు రూ. 13 కోట్లు భరణంగా ఇచ్చాడు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్
హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. కొన్నాళ్లకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో షోయబ్ సానియాకు భరణంగా రూ. 1 కోటి 50 లక్షలు ఇచ్చినట్లు సమాచారం..